NDA

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ షాక్

Submitted by arun on Tue, 08/07/2018 - 13:51

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో  ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు  వైసీపీ మద్దతిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.
 

జగన్ కు బీజేపీ బంపర్ ఆఫర్

Submitted by arun on Mon, 07/16/2018 - 11:27

కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమతో కలిసి వస్తే జగన్‌ సీఎం అయ్యేందుకు సహకరిస్తామన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని తాను మోడీ, అమిత్‌ షాతో మాట్లాడతానని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని రాందాస్‌ చెప్పుకొచ్చారు. కొనసాగి ఉంటే ప్రధాని మోడీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు. 


 

చంద్రబాబును ఓడించడం ఈజీ కాదు : బీజేపీ

Submitted by arun on Sat, 06/09/2018 - 14:49

‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తన అస్తిత్వానికే ముప్పువుంటుందని, అందుకే తనదైన శైలిలో రాజకీయ క్రీడను చంద్రబాబు మొదలుపెట్టారని అన్నారు. ఎన్నికలను ఆరునెలల ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వస్తుందని తాము అనుకున్నామని, కానీ, తమ అంచనాలకు భిన్నంగా ఏడాదికి ముందే చంద్రబాబు బయటకువచ్చారని తెలిపారు.

బీజేపీకి షాక్.. ఎన్డీయే కూటమికి మరో పార్టీ గుడ్‌బై...

Submitted by arun on Thu, 06/07/2018 - 18:08

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా... ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది. 2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.

మా బాబు బంగారం

Submitted by lakshman on Thu, 03/29/2018 - 05:11

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఏడాదిగా డేటాను సేక‌రించిన‌ట్లు, ఆ డేటా ఆధారంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్త‌మ‌వ్వాల‌ని సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు. 

ప‌వ‌న్ బేస్ లెస్ లీడర్..ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్

Submitted by lakshman on Tue, 03/27/2018 - 09:17

టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ బేస్ లెస్ లీడ‌ర్ అని ఎద్దేవా చేశారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ దెబ్బ‌తో  ఏపీ అధికార ప‌క్షం టీడీపీ ల‌బోదిబోమంటోంది. 2014లో టీడీపీకి మ‌ద్ద‌తు పలికిన ప‌వ‌న్ నిన్న జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో విమ‌ర్శ‌లు చేయ‌డం ఆ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. 
గ‌తంలో స‌భ‌లు నిర్వ‌హించిన ప‌వ‌న్ టీడీపీ వ్య‌తిరేకంగా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. కానీ టీడీపీ అవినీతి మార్క్ పాల‌నతో విసుగెత్తిపోయిన జ‌న‌సేనాని తెలుగు త‌మ్ముళ్లను టార్గెట్ చేస్తూ ఏపీలో కొత్త‌రాజ‌కీయానికి తెర‌తీశారు. 

టీడీపీ - బీజేపీల వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్ధితి

Submitted by lakshman on Sat, 03/24/2018 - 21:09

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ రాసిన లేఖ‌పై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఇరుపార్టీలు లేఖ‌ల‌తో ఎన్నాళ్లు ఈ దాగుడు మూత‌ల‌ని ప్ర‌శ్నించారు. 

అరుణ్ జైట్లీ - సుజ‌నా చౌద‌రి భేటీలో నిజం లేదంట‌

Submitted by lakshman on Sat, 03/24/2018 - 16:13

కేంద్ర  ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టీని ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి క‌ల‌వ‌లేదంటూ సీఎం ర‌మేష్ వివ‌రణిచ్చారు. జైట్లీ - సుజ‌నా క‌లిశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. 
దిగ‌జారుడు రాజ‌కీయానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తుందంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ఓ వైపు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఏపీలో ఒక‌లా, పార్ల‌మెంట్ లో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌నిపించేలా టీడీపీ - బీజేపీతో లాలూచి ప‌డిన‌ట్లు స‌మాచారం. 

చంద్ర‌బాబుకు అమిత్ షా ఇచ్చిన కౌంట‌ర్ లేఖ‌లో ఏముందంటే

Submitted by lakshman on Sat, 03/24/2018 - 16:11

టీడీపీ - బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారని ఒక‌రికొక‌రు ప్ర‌శ్నించుకుంటూ రాజ‌కీయ మంట‌ను ర‌గ‌లిస్తున్నారు. అంతేకాదు బీజేపీ చేసిన ఘ‌న‌కార్యం వ‌ల్లే పొత్తునుండి విడిపోయామ‌ని టీడీపీ అంటుంటే అందుకు కౌంట‌ర్ గా రాష్ట్రానికి తాము ఏం చేసిందో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది బీజేపీ.
ఈ నేప‌థ్యంలో టీడీపీకి  బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు.  ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై స‌హ‌క‌రించ‌నందున ఎన్డీఏ తో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు ఓ లేఖ రాశారు. 

చంద్ర‌బాబుకు అమిత్ షా కౌంట‌ర్

Submitted by lakshman on Thu, 03/22/2018 - 09:51

టీడీపీ - బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారని ఒక‌రికొక‌రు ప్ర‌శ్నించుకుంటూ రాజ‌కీయ మంట‌ను ర‌గ‌లిస్తున్నారు. అంతేకాదు బీజేపీ చేసిన ఘ‌న‌కార్యం వ‌ల్లే పొత్తునుండి విడిపోయామ‌ని టీడీపీ అంటుంటే అందుకు కౌంట‌ర్ గా రాష్ట్రానికి తాము ఏం చేశామే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది బీజేపీ.