australia

ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:01

ఆస్టేలియాతో తడోపెడో తెల్చుకోవాడినికి నేడు భారత క్రిక్రెటర్స్ ఆస్టేలియాకు పయనమయ్యారు. బుమ్రా, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, కుల్ దిప్ యాదవ్, రిషబ్ పంత్, చాహల్, శిఖర్ తదితరులు బయల్దేరారు. ఇక్కడ మొత్తం 4 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల్లో తలపడనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కుడా గెలవని భారత్ ఈసారి ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని టీమిండియా తహతహలాడుతోంది. మరో 13 వన్డేలు మాత్రమే ఉండటంతో జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసేదిలేదని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన విషయం తెలిసిందే, గత ఆసీస్‌ పర్యటనతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని కోహ్లీ స్పష్టం చేశారు.

స్ట్రాబెరీల్లో కుట్టు సూదులు... 6 రాష్ట్రాల్లో విక్రయాలు నిలిపివేత

Submitted by arun on Thu, 09/20/2018 - 12:16

ఆస్ట్రేలియాలోని దేశీయ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెరీ పండ్లలో ఇటీవల సూదులు, పిన్నులు బయటపడ్డాయి. దీంతో వినియోగదారులు వాటిని ము క్కలుగా కోసుకుని తినాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచింది.  స్ట్రాబెరీలో సూది ఉన్న కారణంగా ఒక యువకుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియాలోని ఆరు రాష్ట్రాల్లో స్ట్రాబెరీ విక్రయాలను నిలిపివేశారు. అలాగే స్ట్రాబెరీలను మెటల్ డిటెక్టర్లతో పరిశీలిస్తున్నారు. ఆస్ట్రేలియా నూతన ప్రధాని స్కాట్ మారిసన్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని 15 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

వార్నర్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీటిపర్యంతమైన వార్నర్ భార్య

Submitted by arun on Fri, 05/25/2018 - 11:03

ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బ్యాట్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్‌.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్‌ సతీమణి కాండిష్‌ వార్నర్‌ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

ట్యాంపరింగ్‌: ‍​కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్మిత్‌

Submitted by arun on Sun, 03/25/2018 - 16:26

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆసీస్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడిన ఆటగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. దీంతో కెప్టెన్  స్మిత్ తో పాటు వైఎస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్దాయి విచారణ జరిపిన తరువాత ఇతర ఆటగాళ్లపై వేటు వేసే అంశాన్ని పరిశీలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఇక ఐపిఎల్ లో రాజస్దాన్ రాయల్స్ కు నేతృత్వం వహిస్తున్న స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది.

బాల్ ట్యాంపరింగ్ లో అడ్డంగా బుక్కైన ఆసీస్‌

Submitted by arun on Sun, 03/25/2018 - 11:50

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం రాజుకుంది. ఈ వివాదానికి ఆసీస్‌ ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ కారకుడయ్యాడు. మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా తన ప్యాంటు జేబులో నుంచి పసుపు రంగు వస్తువుతో బంతిపై రుద్దడం వివాదానికి తెరలేపింది.

అండర్ -19 ప్రపంచకప్ విజేత భారత్

Submitted by arun on Sat, 02/03/2018 - 13:37

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో మూడుసార్లు చాంపియన్ భారత్ చరిత్ర సృష్టించింది. నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ లోని బే ఓవల్ క్రికెట్ గ్రౌండ్స్ లో ముగిసిన ఫైనల్లో...మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా...47.2 ఓవర్లలో 216 పరుగులు మాత్రమ చేయగలిగింది. రెండోడౌన్ ఆటగాడు మెర్లో 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పేసర్లు పోరెల్, నగర్ కోటీ, స్పిన్నర్లు శివ్ సింగ్, రాయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత్‌ విజయ లక్ష్యం 217

Submitted by arun on Sat, 02/03/2018 - 10:28

రికార్డు స్థాయిలో నాలుగోసారి అండ‌ర్ 19 వ‌రల్డ్‌క‌ప్ సొంతం చేసుకోవ‌డానికి 217 ప‌రుగుల దూరంలో ఉంది యంగిండియా. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ న‌గ‌ర్‌కోటితోపాటు స్పిన్నర్లు చెల‌రేగ‌డంతో ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌.. మొద‌ట్లో బాగానే ఆడినా.. స్పిన్న‌ర్లు దిగిన త‌ర్వాత సీన్ మారిపోయింది. ఇషాన్ పోరెల్‌, న‌గ‌ర్‌కోటి, అనుకూల్‌రాయ్‌, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది.