Nara Brahmani

నారా బ్రాహ్మణి ఆడ సింహం

Submitted by arun on Wed, 10/24/2018 - 14:48

నారా బ్రాహ్మణి ఆడ సింహంలాంటి వారు అంటూ బాలకృష్ణ కుమార్తెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు సినీ నటుడు మంచు మనోజ్‌. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులంతా ముందుకొచ్చి విరాళం అందజేస్తున్నారు. ఇటీవల నారా బ్రాహ్మణి కూడా ముందుకొచ్చి శ్రీకాకుళం జిల్లాలోని 10 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. దీనిపై మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పందించాడు.‘‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో ఆమె ఒకరు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్

Submitted by arun on Mon, 10/22/2018 - 16:52

జూనీయర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా దసర బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో సక్సెస్ సెలెబ్రెషన్స్ చేసుకుంది చిత్ర యూనిట్.. ఈ సక్సెస్ మీట్ కు చీప్ గెస్ట్ గా బాలయ్య రావటంతో నందమూరి అభిమానులకు దసరా దీపావళి ఒకేసారి వచ్చేసాయి.. బాలయ్య త్వరలోనే సినిమా చూస్తా అన్నాడు.. కానీ బాలయ్య కూతురు నారా చంద్ర బాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి అరవింద సమేత సినిమా మొన్ననే చూసిందంటా.. సినిమాలో తారక్ యాక్టీంగ్ సూపర్ అంటు ఎన్టీఆర్ ను పొగడటమే కాదు ఓ మంచి గిప్ట్ పంపింది.

రాహుల్‌తో భేటీకి హాజరైన నారా బ్రాహ్మణి

Submitted by arun on Tue, 08/14/2018 - 12:38

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 245 మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా..దాదాపు వంద మందికి పైగా హాజరయ్యారు. హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న GST , నోట్లరద్దు తదనంతర పరిణామాలపై రాహుల్ చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజర తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ది కోసం తీసుకున్న చర్యలు గురించి ఆరా తీస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌పై నారా బ్రాహ్మణి స్పందన

Submitted by arun on Fri, 02/02/2018 - 18:58

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పందించారు. విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని కితాబిచ్చారు. ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు.