ravi teja

మాస్ మాహారాజా రవి తేజ అసలు పేరు

Submitted by arun on Thu, 11/01/2018 - 15:40

రవితేజ అసలు పేరు మీకు తెలుసా! అయితే ప్రముఖ తెలుగు సినిమా నటుడుగానే ప్రపంచవ్యాప్తంగా.. పేరు తెచ్చుకున్నా... అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవి శంకర్ రాజు. శ్రీ.కో.

Tags

"ట‌చ్ చేసి చూడు"ను రిజ‌క్ట్ చేసిన టాప్ హీరో

Submitted by lakshman on Sun, 02/04/2018 - 18:04

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:03

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది. 
 

రాజమౌళి మల్టీస్టారర్లో విలన్..ఐడియా బావుందట

Submitted by arun on Fri, 02/02/2018 - 12:34

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు మెల్లమెల్లగా పెరుగుతోంది. త్వరలో నాగార్జున, నానిల కాంబినేషన్‌లో ఒక చిత్రం పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెగా, నందమూరి మల్టీస్టారర్‌ ప్రారంభం కానుంది. ఇలా వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇతర హీరోలు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తిని కనబర్చుతున్నారు. తాజాగా రవితేజ కూడా తాను మల్టీస్టారర్‌ చిత్రాలకు పూర్తిగా సహకరిస్తాను అని, మంచి కథలతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తాను అంటూ తేల్చి చెప్పాడు. తాజాగా రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాన్ని చేశాడు.

ట‌చ్ చేసి చూడు ప్ల‌స్ లు, మైన‌స్ లు

Submitted by arun on Fri, 02/02/2018 - 11:02

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. రాజా ది గ్రేట్ త‌రువాత వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో బిజీగా మారిన మాస్ మ‌హ‌రాజా ట‌చ్ చేసి చూడు ప్ర‌మోష‌న్ కాస్త పేల‌వంగా మారిన‌ట్లు తెలుస్తోంది.  ఫ‌స్టాప్ అంతా ఫ్లాట్ నేర‌ష‌న్ తో న‌డిచిన ఇంట‌ర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింద‌ని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచాలు పెరుగుతాయి.

అంత ఓవ‌ర్ కాన్ఫిడెంట్ వ‌ద్ద‌మ్మ రాజా

Submitted by lakshman on Thu, 02/01/2018 - 18:17

రాజా ది గ్రేట్ తో పుంజుకున్న మాస్ మ‌హ‌జ రాజ ర‌వితేజ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతానికి టచ్ చేసి చూడు సినిమా విడుద‌ల‌తో బిజిగా ఉన్నాడు. అంత‌వ‌ర‌కు బాగున్నా..కొంత‌మందికి ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతోంది తెలియ‌ద‌ని అంటున్నారు. మొన్న ఆ మ‌ధ్య ట‌చ్ చేసి చూడు సినిమా టీజ‌ర్ తో హాయ్ చేప్పినా అ తరువాత ప‌త్తాలేకుండా పోయాడు. సినిమా విడుద‌ల‌వుతున్నా ప్ర‌మోషన్లు గ‌ట్రా చేస్తే వ‌సూళ్లు రాబ‌ట్టుకునే అవ‌కాశం ఉంది. కానీ అదేం జ‌ర‌గలేదు. నామ‌మాత్ర‌పు ఇంట‌ర్వ్యూల‌తో మ‌మ అనిపిస్తున్నాడు.