nitya menon

5 రోజులు.. 20 మిలియ‌న్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 15:48

త‌మిళ‌నాట క‌థానాయ‌కుడు విజ‌య్ కుండే క్రేజే వేరు. మాస్‌లో విజ‌య్‌కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆయ‌న కొత్త చిత్రం టీజ‌ర్ మరోసారి రుజువు చేసింది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' (తెలుగులో 'అదిరింది') టీజ‌ర్‌ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేశారు. 20 గంట‌ల్లోపే ఈ సినిమా టీజ‌ర్ 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. మ‌రో నాలుగు రోజుల్లో ఇంకో 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని.. మొత్తంగా 5 రోజుల్లో 20 మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది.

'కావ్యాస్ డైరీ' డైరెక్ట‌ర్‌తో నిత్యా

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 18:05

పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించిన నిత్యా మీన‌న్‌.. 'జ‌న‌తా గ్యారేజ్' త‌రువాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌నేలేదు. త‌మిళంలో నిత్యా న‌టించిన తాజా చిత్రం 'మెర్స‌ల్' దీపావ‌ళికి విడుద‌ల కాబోతోంది. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా అనువాదం కానుంది. కాగా, తాజాగా నిత్యా ఓ మల‌యాళ చిత్రానికి ఓకే చెప్పింది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు వి.కె.ప్ర‌కాష్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ @ 10

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 13:24

నేచుర‌ల్ స్టార్ నానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌ను సొంతం చేసుకుని 'డబుల్ హ్యాట్రిక్ హీరో' అనే పేరు కూడా సంపాదించేశాడు. ప్ర‌స్తుతం నాని 'ఎం.సి.ఎ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు.

విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ కేర‌ళ కుట్టిలే హీరోయిన్‌గా న‌టించ‌డం. 'ఎం.సి.ఎ'లో 'ఫిదా' ఫేమ్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. 'కృష్ణార్జున యుద్ధం'లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రూ కూడా మ‌ల‌యాళ చిత్రం 'ప్రేమ‌మ్‌'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌లే కావ‌డం విశేషం.  

రికార్డు కొట్టిన 'మెర్స‌ల్‌'

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 13:34

త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి 'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ సినిమా 'అదిరింది' పేరుతో విడుద‌ల కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. 

'అదిరింది' ఆ సినిమాకి న్యూ వెర్ష‌నా?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 18:54

విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో 'రాజా రాణి' ఫేమ్ అట్లీ రూపొందించిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. స‌మంత‌, కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ విడుద‌ల‌య్యింది. మూడు పాత్ర‌ల్లో విజ‌య్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా ఒక‌టే మాట అంటున్నారు.

రేపు 'మెర్స‌ల్' టీజ‌ర్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 12:05

'తెరి' (తెలుగులో 'పోలీస్‌') వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు విజ‌య్‌, క‌థానాయిక స‌మంత‌, ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్ వ‌స్తున్న చిత్రం 'మెర్స‌ల్‌'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుద‌ల కానుంది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు కాజ‌ల్‌, నిత్యా మీన‌న్ కూడా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

నితిన్ ఈ సారి రూట్ మార్చాడు

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 12:13

క‌లిసొచ్చిన కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయ‌డం అనేది సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణం. యువ క‌థానాయ‌కుడు నితిన్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. త‌న తొలి చిత్రం 'జ‌యం'లో హీరోయిన్‌గా న‌టించిన స‌దాతో క‌లిసి 'ట‌క్క‌రి' అనే మ‌రో చిత్రం చేశాడు. అలాగే 'సై' చిత్రంతో త‌న‌కు హిట్ పెయిర్‌గా నిలిచిన జెనీలియాతో 'రామ్' చేశాడు. ఇక 'ఇష్క్' తో అచ్చొచ్చిన నిత్యా మీన‌న్‌తో 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చేశాడు.

స‌మంతకి ఒక్కో సినిమా ఒక్కోలా

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 16:29

తెలుగులోనే కాదు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది చెన్నై చిన్న‌ది స‌మంత‌. ఇక్క‌డలాగే త‌మిళంలోనూ స్టార్ హీరోల‌తో ఆడిపాడిందీ ముద్దుగుమ్మ‌. ఇక‌ త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టిస్తోంది స‌మంత‌. 'మెర్స‌ల్' పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఇదివ‌ర‌కు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'క‌త్తి', 'తెరి' చిత్రాలు వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజ‌యాన్నే న‌మోదు చేసుకున్నాయి.