Union Budget

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Submitted by arun on Sat, 02/17/2018 - 15:56

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే...ఇప్పడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏపీకి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న చంద్రబాబు..విభజన హామీలను అమలు చెయ్యాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని చంద్రబాబు అన్నారు.

పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన

Submitted by arun on Tue, 02/06/2018 - 11:22

అటు  విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 దగ్గర నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప‍్రదర్శించారు.  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పాల్గొన్నారు.
 

గొగ్గొలు పెడుతున్నా అశోక్ గ‌జ‌ప‌తి ప‌ట్టించుకోవ‌డంలేదే

Submitted by arun on Mon, 02/05/2018 - 17:07

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభలో ప్లకార్డులో నిరసన తెలిపారు. మరి కొంత మంది ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణంలోని గాంధీ విగ్రహం వ్యక్తం నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు, అమరావతికి నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదంత కళ్ల ముందు జరుగుతున్నా అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఎంపీలు విభజన హామీలు కోసం నిరసన వ్యక్తం చేస్తే తానెందుకు స్పందించాలన్న రీతిలో చూస్తూ ఉండిపోయారు. 

పోరాటానికి సమయం ఆసన్నమైంది...ఇక తెగదెంపులే: ఎంపీ టీజీ

Submitted by arun on Fri, 02/02/2018 - 12:21

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు గడిచిపోయాయి, ఇక సహించేది లేదన్న టీజీ కేంద్రంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబును ఎవరూ తక్కువ అంచనా వేయొద్దన్న టీజీ వెంకటేష్‌ మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే సత్తా బాబుకి ఉందన్నారు. సొంతంగా బలముందనే పొగరు బీజేపీకి ఉన్నా  కేంద్రంపై అంచెలంచెలుగా పోరాడతామన్నారు. మూడు విడతలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న టీజీ చివరి అస్త్రంగా ఇక తెగదెంపులేనన్నారు. పోరాట కార్యాచరణను ఆదివారం చంద్రబాబు ప్రకటిస్తారన్నారు.
 

ఎన్నికల వేళ రైతులకు వల

Submitted by arun on Thu, 02/01/2018 - 16:25

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన లోక్ సభలో ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్వేయమన్న జైట్లీ.. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు వివరించారు. అంతే కాదు కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 13:54

తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్థావించలేదు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపైనా స్పందించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీరుపై  వైసీపీ ఎంపీలు  రాజీనామాలకు సిద్ధమయ్యారు. 

మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by arun on Thu, 02/01/2018 - 12:46

ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, పదికోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.

బడ్జెట్ ఆరంభంలోనే సంచలన ప్రకటన!

Submitted by arun on Thu, 02/01/2018 - 11:39

2018 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రైతుల కోసం సంచలన ప్రకటన చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సారి కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాల జల్లు కురిపిస్తోంది. ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేందుకు హరిత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టినట్టు ప్రకటించారు. కాగా సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి జైట్లీ హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ప్రసంగించడం విశేషం.

బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ

Submitted by arun on Thu, 02/01/2018 - 11:18

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఎంపీ చింతామణి మంగ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్‌ అనుమతితో జైట్లీ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి తొలిసారి హిందీలో బడ్జెట్‌ విషయాలను ప్రసంగిస్తుండటం విశేషం. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇది.