Harish Rao

ఇవాళ మంచి ముహూర్తాలు...కేసీఆర్ సహా పలువురి నామినేషన్లు...

Submitted by arun on Wed, 11/14/2018 - 10:23

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం సమయంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తే మరోసారి రాజయోగం వస్తుందని పండితుల సూచించారు దీంతో ముహూర్త బలాన్ని ఎక్కువగా నమ్మే కేసీఆర్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇవాళ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నామినేష్లు వేయనున్నారు. 

ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోండి...

Submitted by arun on Sat, 11/10/2018 - 11:16

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 

హరీశ్‌, రేవంత్‌లకు ఈసీ నోటీసులు

Submitted by arun on Fri, 11/09/2018 - 17:09

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. తెలంగాణలోని పలువురు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేశారనే  ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

హరీష్‌ను టార్గెట్‌ చేయడంలో వ్యూహం అదేనా!

Submitted by arun on Tue, 11/06/2018 - 09:47

మ‌హకూట‌మిని చీల్చాల‌న్న కేసీఆర్ వ్యూహాల‌ను త‌ల‌ద‌న్నేలా విపక్షాలు మైండ్‌గేమ్‌ వాడివేడి పెంచాయా గులాబీ ద‌ళాన్నే చీల్చాలని మ‌హ‌కూట‌మి టార్గెట్ చేస్తోందా ఇందుకు టీఆర్ఎస్ లో హర్డ్ వర్కర్.. ట్రబుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీష్‌ రావునే ఎంచుకున్నారా పార్టీ నుంచి బయ‌ట‌కొస్తున్నార‌ని ఒక‌రు కాంగ్రెస్‌లో చేరి సీఎం అవుతార‌ని మ‌రొక కీల‌క నేత చేస్తున్న బ‌హిరంగ ప్రచారం, మైండ్‌ గేమ్‌లో భాగమేనా చివరి వరకూ టీఆర్ఎస్‌లోననని, హరీష్‌ లెక్కలేనన్ని సార్లు చెప్పినా ప్రతిపక్షాలు అదే అస్త్రాన్ని ప్రయోగించడంలో ఉద్దేశమేంటి?

ఆధారాలు చూపకపోతే ఊచలు లెక్కపెట్టిస్తా

Submitted by arun on Sun, 11/04/2018 - 12:01

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి హరీష్‌రావు త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని కాంగ్రెస్‌నేత  ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్‌ ఇచ్చారు .తన పుట్టుక, చావు టీఆర్‌ఎస్ పార్టీలోనే అన్న హరీష్‌రావు తన జీవితం కేసీఆర్ కే అంకితం అన్నారు. ముచ్చటగా మూడోసారికూడా ఓడిపోతాననే భయంతో, మతిస్ధిమితం తప్పి కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పక్కాఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు. 

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా మా రైతులకు నీళ్లందిస్తాం: మంత్రి హరీశ్ రావు

Submitted by arun on Wed, 10/24/2018 - 16:28

వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడ్డా, వెయ్యిమంది కాంగ్రెసోళ్లు వత్తాసు పలికినా కచ్చితంగా కల్వకుర్తి మోటర్లు నడుపుతాం, మా రైతులకు నీళ్లందిస్తామని అన్నారు  మంత్రి హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపివేయాలని, అది అక్రమ ప్రాజెక్టు అని చంద్రబాబు నాడు ఢిల్లీలో ఫిర్యాదు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే, టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందన్నారు.

హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

Submitted by arun on Sat, 09/29/2018 - 12:52

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హరీష్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కార్యకర్తలు వాహనాలను వదిలేసి పారిపోయారు. హరీష్ మాత్రం పొగల్లో చిక్కుకుని కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. మంత్రిని మంటలు, పొగ చుట్టుముట్టడంతో ఆంతా కంగారు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

విపక్షాలకు అస్త్రాలుగా మారిన హరీశ్ వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 09/22/2018 - 17:06

నిన్న ఇబ్రహీంపూర్‌ సభలో పాల్గొన్న హరీష్‌రావు  ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. హరీష్‌ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ టీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయి. హరీష్‌ వాఖ్యలతో టీఆర్ఎస్‌లో ఇంటిపోరు మొదలైందంటూ రఘునందన్‌రావు లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఇబ్రహీంపూర్‌లో మాట్లాడిన హరీష్‌రావు స్ధానికుల స్పందన చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఆప్యాయత, అనురాగాల మధ్యే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందంటూ వ్యా‌ఖ్యానించారు.

హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు: రఘునందన్ రావు

Submitted by arun on Sat, 09/22/2018 - 16:05

బీజేపీ నేత రఘునందన్ రావు అపధర్మ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు ప్రారంభమైందన్న ఆయన  హరీష్‌రావును పార్టీ నుంచి పంపలేక పొగబెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో తొలి మార్పు సిద్ధిపేటలోనే జరుగుతుందన్నారు.  సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని భావిన్నాడని ఆయన అన్నారు. కారు నాలుగు టైర్లలో ఒకటి పంక్ఛర్ అయిందన్న రఘునందన్ రావు స్టెప్నీగా ఉంటాడనే సంతోష్‌ను రాజ్యసభకు పంపారంటూ వ్యాఖ్యానించారు.