raasi khanna

విజ‌య‌ద‌శ‌మికి 'ఆక్సిజ‌న్' ట్రైల‌ర్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 19:28

గోపీచంద్‌, రాశి ఖ‌న్నా, అను ఇమ్మానియేల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'ఆక్సిజ‌న్‌'. 'నీ మ‌న‌సు నాకు తెలుసు' ఫేం ఎం.జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందించిన ఈ చిత్రం ఆడియోని అక్టోబ‌ర్ తొలి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ని విజ‌య‌ద‌శ‌మి రోజున మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు. 'లౌక్యం' త‌రువాత స‌రైన హిట్ లేని గోపీచంద్‌కి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది. అక్టోబ‌ర్ 27న 'ఆక్సిజ‌న్‌' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మూడు వారాలు .. మూడు సినిమాలు..

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 18:37

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్' చిత్రాల‌తో సంద‌డి చేసింది. తాజాగా ఎన్టీఆర్‌కి జోడీగా 'జైల‌వ‌కుశ‌'లో మెరిసింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ రాశి న‌టిస్తోంది. కాగా, రాశి న‌టించిన మూడు చిత్రాలు అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'రాజా ది గ్రేట్‌', 'విల‌న్‌', 'ఆక్సిజ‌న్‌'.

క్యూ క‌డుతున్న విశాల్ సినిమాలు

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 16:20

పేరుకి తెలుగువాడైనా.. త‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు యువ క‌థానాయ‌కుడు విశాల్‌. 'పందెం కోడి', 'పొగ‌రు', 'పూజ' త‌దిత‌ర అనువాద‌ చిత్రాల‌తో తెలుగులోనూ మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న విశాల్‌.. అతి త్వ‌ర‌లో 'డిటెక్టివ్‌'గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. త‌మిళంలో విజ‌యం సాధించిన 'తుప్ప‌రివాల‌న్'కి ఇది అనువాద రూపం.

3 రోజులు..రూ.75 కోట్లు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:18

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ‌'.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల‌కి గానూ ఈ సినిమా రూ.75 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది. ఇవాళ కూడా క‌లెక్ష‌న్లు స్ట‌డీగానే ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం లేదా సోమ‌వారంతో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.

'బాల‌కృష్ణుడు' బాగున్నాడు

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 16:23

ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ శైలే వేరు. తొలి చిత్రం 'బాణం' నుంచి తాజాగా విడుద‌లైన 'క‌థ‌లో రాజ‌కుమారి' వ‌ర‌కు కొత్త‌ద‌నం ఉండే క‌థ‌ల‌కే ఓటేస్తూ వ‌స్తున్న రోహిత్‌.. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల‌లో 'బాల‌కృష్ణుడు' ఒక‌టి. ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తోంది. గ‌తంలో వీరి కాంబినేష‌న్ లో 'జో అచ్యుతానంద‌', 'శంక‌ర' చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

జై ఒక అద్భుతం - ద‌ర్శ‌కేంద్రుడు

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 13:20

'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను'.. ఇదీ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జైల‌వ‌కుశ' చూశాక ట్విట్ట‌ర్ లో తెలిపిన స్పంద‌న‌.

2400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:30

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా  చిత్రం 'జై ల‌వ కుశ‌'. కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు తార‌క్‌. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి 'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

రేపు 'రాజా ది గ్రేట్' టైటిల్ ట్రాక్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 12:05

'ప‌టాస్‌', 'సుప్రీమ్' చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో 'రాజా ది గ్రేట్ 'చేస్తున్నాడాయ‌న‌. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశి ఖ‌న్నా ఓ పాట‌లో త‌ళుక్కున మెర‌వనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత‌మందిస్తున్నారు.

ఒకే రోజున‌ రెండు సినిమాలు

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 16:15

'ఊహలు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ రాశీ ఖ‌న్నా. తొలి చిత్రంలో హోమ్లీ లుక్స్‌తో క‌ట్టిప‌డేసిన రాశి.. ఆ త‌రువాత గ్లామ‌ర్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్'.. ఇలా రాశి న‌టించిన ప్ర‌తి చిత్రంలోనూ ఆమె గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 'హైప‌ర్' త‌రువాత దాదాపు ఏడాది గ్యాప్ తో రాశి కొత్త చిత్రం రాబోతోంది. ఆ సినిమానే 'జైల‌వ‌కుశ‌'. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో నివేదా మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ఇదిలాఉంటే..