Mahakutami

మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీకి మొండి చెయ్యి ...ఒక్క సీటు కూడా కేటాయించని కాంగ్రెస్‌

Submitted by arun on Tue, 11/13/2018 - 11:47

తెలంగాణ ఇంటి పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. మహాకూటమిలో చోటు దక్కుతుందని భావించిన ఆశలు అడియాశలయ్యాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ,టీజేఎస్‌, సీపీఐలకు స్ధానాలు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇంటి పార్టీకి మాత్రం ఒక్క సీటు కేటాయించలేదు. కుదిరితే నకిరేకల్ లేదంటే మహబూబ్ నగర్ ఇవ్వాలన్న ఇంటి పార్టీ అధినేత చెరకు సుధాకర్ వినతిని కాంగ్రెస్  పట్టించుకోలేదు. రెండు స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో  కూటమిలో ఇంటి పార్టీకి చోటు లేకుండా పోయింది. తాజా పరిణామాల నేపధ్యంలో తమ దారి తమదేనని చెరుకు సుధాకర్ చెబుతున్నారు.  

కూటమికి కాంగ్రెస్ బారీ షాక్..

Submitted by arun on Tue, 11/13/2018 - 10:01

కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, నేతలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అయితే మహాకూటమిలో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలు కోరిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించి.. షాక్ ఇచ్చింది. వరుస భేటీలు, గంటల కొద్ది చర్చలు, మరెన్నో సమాలోచనలు సీట్లపై ఎడతెగని పంచాయతీలు తెలంగాణలో మహా కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. చివరకి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు కూడా సీట్ల సర్ధుబాటుపై భాగస్వామ్య పార్టీలకు క్లారిటీ రాని పరిస్థితి. అయితే, ప్రజలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది.

ఉమ్మడి అజెండాపై మహా కూటమి ఫోకస్‌

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:31

అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మహాకూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టారు. ఉమ్మడి అజెండాతోనే కూటమి పార్టీలన్నీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించిన కూటమి పార్టీలు ముసాయిదాపై అంగీకారానికి వచ్చాయి. మరోసారి చర్చించి రేపే ఉమ్మడి అజెండాను ప్రకటించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశం ప్రాథమికంగా ఓ కొలిక్కి రావడంతో కూటమి పార్టీలు ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టాయి.

రాహుల్ తో ముగిసిన ఉత్తమ్, కుంతియా స్క్రినింగ్ కమిటీ సభ్యుల భేటీ

Submitted by chandram on Mon, 11/12/2018 - 15:18

స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన జాబితాపై అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అభ్యర్ధులను ఖరారు చేశారో చెప్పాలంటూ నిలదీయడంతో నేతలు పునరాలోచనలో పడినట్టు సమాచారం. దీంతో తమకు అందిన జాబితాతో ఎంపిక చేసిన అభ‌్యర్ధుల వివరాలను తీసుకుని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, భక్త చర‌ణ్ దాస్‌లు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు.  

కూటమి లెక్కల్లో గందరగోళం...టీడీపీ, టీజేఎస్‌ సీట్లు ఓకే.. సందిగ్ధంలో సీపీఐ?

Submitted by arun on Mon, 11/12/2018 - 10:33

మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, టీజేఎస్‌ స్థానాలపై లెక్కలు కొలిక్కివచ్చినా, సీపీఐకి కేటాయించే స్థానాలపై మాత్రం పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం, మునుగోడు స్థానాలపై సీపీఐ పట్టుబడుతోంది. ఐదు సీట్లు ఇస్తే ఓకే.. లేకుంటే కూటమికి కటీఫ్ చెబుతామంటోంది సీపీఐ. అయితే, కూటమి లెక్కలపై ఇవాళ కీలక ప్రకటన వెలువడనుండటంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. 

Tags

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళన

Submitted by chandram on Sun, 11/11/2018 - 17:19

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టికెట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణభవన్‌వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట దళిత నేతలు ఆందోళన చేపట్టారు. ప్యారాచూట్‌ నేతలకు సీట్లు కేటాయించొద్దని, పార్టీని నమ్ముకుని ఎన్నోఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని అన్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడంలేదని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:38

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలవుతున్నామహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాము కోరిన నియోజకవర్గాలు ఇవ్వకపోవడం, సంఖ్యపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం, జాబితా ఖరారులో జాప్యం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. మహాకూటమిలో సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర జాప్యమవుతోంది.

కూటమి అధికారంలోకి వస్తే… రాష్ట్రంలో సంక్షోభం తప్పదు

Submitted by arun on Sat, 11/10/2018 - 17:50

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో రైతు సమ్మేళన సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాకే మహాకూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడగాలన్నారు. సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ఉండదు. తెలంగాణ ద్రోహితో జతకట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. ఉద్యమించే వాడినే తెలంగాణ కోరుకుంటుంది. గులాంగిరి చేసేవారికి తెలంగాణ సమాజం ఎన్నడూ అండగా ఉండదు. సంక్షేమం కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

కూటమిలో సీట్ల కుంపట్లు.. తెగేదాకా లాగుతారా?

Submitted by arun on Sat, 11/10/2018 - 16:14

సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమతున్నాయి మహకూటమిలోని భాగస్వామ్య పార్టీలు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో భేటీ అయిన ఎల్.రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ సీపీఐకి మూడు స్థానాలనే ఇస్తామనడంతో ఐదు స్థానాలు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. టీడీపీకి 14 సీట్లు ఇస్తామన్నడంతో మరో రెండు సీట్లు కావాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాసేపట్లో పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్‌తో భాగస్వామ్య పార్టీ నేతలు భేటీకానున్నాయి. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు సీట్లపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

చీలిక దిశగా మహాకూటమి

Submitted by arun on Sat, 11/10/2018 - 10:37

సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ తమకు 3 సీట్లు ఇవ్వడంపై సీపీఐ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లిలో పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది. టీజేఎస్‌ కూడా సీపీఐ బాటలోనే పయనిస్తోంది. తమకు మరిన్ని సీట్లు కావాలంటోంది. ఇదంతా చూస్తుంటే మహాకూటమిలో చీలిక ఖాయంగానే కనిపిస్తోంది. 

Tags