Budget 2018

ఎపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు ఆవేదన

Submitted by arun on Mon, 02/05/2018 - 10:48

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కేంద్రంపై వీలైనంత ఒత్తిడి తేవాలని ఎంపీలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రులను కలవాలని ఎంపీల కు సీఎం చంద్రబాబు సూచించారు.

కేంద్ర బడ్జెట్‌పై నారా బ్రాహ్మణి స్పందన

Submitted by arun on Fri, 02/02/2018 - 18:58

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పందించారు. విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని కితాబిచ్చారు. ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు. 

చంద్ర‌బాబు సై అంటే..

Submitted by arun on Thu, 02/01/2018 - 16:45

చంద్రబాబు సై అంటే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపించిన జేసీ పొమ్మనలేక పొగ పెడుతున్నట్టు ఉందని అన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని,  అతి తక్కువ నిధులిచ్చి సాయం చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ప్రశ్నించారు.

కేంద్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి పెద్దపీట

Submitted by arun on Thu, 02/01/2018 - 16:36

దేశంలోని 125 కోట్ల ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆరోగ్యరంగానికి లక్షా 38వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా
2019 ఎన్నికల్లో ఓటర్లకు వలవేయటానికి రంగం సిద్ధం చేశారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి కేటాయింపుల హైలైట్స్...

ఎన్నికల వేళ రైతులకు వల

Submitted by arun on Thu, 02/01/2018 - 16:25

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన లోక్ సభలో ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్వేయమన్న జైట్లీ.. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు వివరించారు. అంతే కాదు కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

జైట్లీ బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్ కొనడం కష్టమే

Submitted by arun on Thu, 02/01/2018 - 14:37

మొబైల్ ప్రియులకు చేదు కబురందించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. నిత్యావసరాల జాబితాలో చేరిన మొబైల్ ఫోన్ ధరలపై వాత పెట్టారు జైట్లీ. ఇప్పటి వరకు 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీ.. 20శాతానికి పెంచారు. దీంతో మొబైల్ ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఫోన్ల ధరలు 5శాతం పెరగనున్నాయి. దేశీయంగా ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్ల ధరల్లో మార్పు లేదు. పూర్తిగా విదేశాల్లో తయారయ్యే.. ఇండియాలో మార్కెట్ చేసుకునే కంపెనీ ఫోన్ ధరలు పెరగనున్నాయి. బడ్జెట్‌లో మొబైల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ పెంపే దీనికి కారణం. కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 20 శాతానికి పెంచారు.

కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు సంబంధించిన ముఖ్యాంశాలు

Submitted by arun on Thu, 02/01/2018 - 14:04

2018-19 బడ్జెట్ లో రైల్వే భద్రతకు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ఆర్థిక మంత్రి పెద్ద పీట వేశారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో ఆయన ప్రసంగిస్తూ, రైల్వే విద్యుదీకరణకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. అన్ని రైళ్లో వైఫై, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వేకు సంబంధించిన ప్రధానాంశాలు ఇవే.

రాజీనామా చేసే యోచనలో వైసీపీ ఎంపీలు

Submitted by arun on Thu, 02/01/2018 - 13:47

కేంద్ర  బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. రాజీనామా చేసే యోచనలో ఆ పార్టీ ఎంపీలు  ఉన్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ , ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన  లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ ..బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఆశల పద్దుపై ఎన్నెన్నో అంచనాలు..కేంద్ర బడ్జెట్‌పై హెచ్‌‌ఎంటీవీ విశ్లేషణ

Submitted by arun on Wed, 01/31/2018 - 12:14

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వస్తుందంటే అంతా.. ఆశల పద్దు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బడ్జెట్ కసరత్తు వెనుక వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు, రాష్ట్రాలు.. ఇలా బోలెడు కోణాలు దృష్టిలో పెట్టుకుని కత్తి మీద సాము చేయాలి. ఇలా కేంద్ర బడ్జెట్ లో ఆసక్తికరమైన నిజాలు చాలా ఉన్నాయి. 

ఆర్థిక సర్వే..వృద్ధిరేటు పరుగు

Submitted by arun on Tue, 01/30/2018 - 11:57

దేశ ఆర్థిక పురోగతి రేటు మెరుగ్గా ఉందని ఆర్థిక సర్వే  తెలిపింది. 2018-19 మధ్య కాలానికి ఏడునుంచి 7.5 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు పుష్కలంగా  కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్న ముడి చమురు ధరలు మనదేశ ఆర్థిక స్థితిపై కలిగించే ప్రభావంపై ఎకనామిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.