kathi mahesh twitter

హే..క‌త్తిమ‌హేష్ మళ్లీ ఏసేసాడు..!

Submitted by lakshman on Tue, 01/30/2018 - 07:45

వివాదం ముగిసింద‌నుకుంటే మ‌ళ్లి మొద‌టికి వ‌స్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఐదు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు , క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరింది. క‌త్తి మ‌హేష్ , ప‌వ‌న్ రాజ‌కీయాలు, సినిమాల గురించి సంద‌ర్భాను సారం విమ‌ర్శ‌లు చేసేవాడు. ఆ విమ‌ర్శ‌లు కాస్త వ్య‌క్తిగ‌త జీవితాల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చాయి. అయితే ఈ నేప‌థ్యంలో  ఓ టీవీ ఛాన‌ల్ డిబెట్ లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా క‌త్తిమ‌హేష్ పై ప‌వ‌న్ అభిమానులు కోడి గుడ్ల‌తో దాడి చేశారు. ఆ దాడి కాస్త తీవ్ర‌త‌రం కావ‌డంతో పెద్ద‌మ‌నుషులు జోక్యం చేసుకొని ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చారు.