ysr

వైఎస్ కు చంద్ర‌బాబుకు మ‌ధ్యఉన్న తేడా అదేనా

Submitted by lakshman on Thu, 04/12/2018 - 11:53

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే ..తాము బీజేపీ తో కుమ్మ‌క్క‌య్యామ‌ని అన‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. బీజేపీ కుమ్మక్కైతే హ‌స్తిన‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేయాల్సిన అవస‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రం అంతా వైసీపీ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు ఆనంద న‌గ‌రాల పేరుతో వేడుక‌లు జ‌ర‌ప‌డం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. ఇలాంటి ప‌నికిమాలిన కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హాజ‌ర‌వ్వ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. 

వైసీపీలోకి వైఎస్ వీరవిధేయులు

Submitted by lakshman on Mon, 01/29/2018 - 23:14

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తూ 2019 ఎన్నిక‌ల్లో గెలుపుకోసం వ్యూహాలు ర‌చ‌యిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీల‌కు చెందిన బ‌ల‌మైన నేత‌ల్ని త‌న‌వైపు తిప్పుకునేందుకు పాద‌యాత్రను ఎంచుకున్నాడు. స్వ‌కారం..స్వామికార్యం అన్న చందంగా ఓవైపు పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు పార్టీని బ‌ల‌ప‌ర‌చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు , గూడురు, ప్ర‌కాశం జిల్లాల‌లో  చక్రం తిప్పిన  మాజీ బాపట్ల ఎంపీ ప‌న‌బాక ల‌క్ష్మీ ఆమె భ‌ర్త ప‌న‌బాక కృష్ణ‌య్య‌కు జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.