National

నేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం ఝలక్

Submitted by arun on Tue, 09/25/2018 - 12:16

నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తెలిపారు. వచ్చే నెల 2 న పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా కీలక కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరిన పెట్రోల్ ధర...సెంచరీ దిశగా దూసుకుపోతున్న...

Submitted by arun on Tue, 09/25/2018 - 10:31

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. త్వరలోనే సెంచరీ దాటనున్నాయి. గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటిసారిగా లీటర్‌ పెట్రోల్‌ ధర 90 రుపాయిల మార్క్‌ను దాటి రికార్డ్‌ సృష్టించింది. ముంబైలో ఐవోసీ ఔట్‌లెట్లలో లీటర్‌ పెట్రోల్‌ ధర 90రూపాయిల 8పైసలకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి.

కేరళలో ఎల్లోఅలర్ట్‌.. మళ్లీ భారీ వర్షసూచన...

Submitted by arun on Mon, 09/24/2018 - 17:52

వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ఆ విపత్తు నుంచి తేరుకోకముందే, మరో ముప్పు ముంచుకొచ్చింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, కేరళలోని ఏడు జిల్లాల్లో 64.4 మిల్లీమీటర్ల నుంచి 124.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంవో వెల్లడించింది.

ఉత్తరాదిన రెడ్‌అలర్ట్‌...పంజాబ్‌, హర్యానాలోనూ భారీ వర్షాలు

Submitted by arun on Mon, 09/24/2018 - 17:45

మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వరదలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉదృతంగా ఉన్న కులు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్‌ ఖాడ్‌ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించాడు.

సిక్కింలో తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ

Submitted by arun on Mon, 09/24/2018 - 13:11

ప్రధాని మోదీ సిక్కీంలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విమానాశ్రయం సిక్కీం ప్రజలకు ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2009లో పాక్యాంగ్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగగా ఇది పూర్తవడానికి 9 ఏండ్లు పట్టింది. 201 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం పాక్యాంగ్ గ్రామానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది.

ముద్దిచ్చిన భర్త నాలుకను కొరికిన భార్య...

Submitted by arun on Mon, 09/24/2018 - 12:47

గొడవకు దిగిన భార్యను శాంతింపచేసేందుకు భర్త చేసిన ప్రయత్నం అతడి నాలుకకు ఎసరు తెచ్చింది. ముద్దిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తను ఇదే అదనుగా భావించిన భార్య అతడి నాలుకను కొరికేసింది. ఢిల్లీలోని రణహోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రణహోలా ప్రాంతానికి చెందిన కరణ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్నాడు. కరణ్ పెళ్లి అయి రెండేళ్లు గడచినా అతని భార్య భర్తతో వైవాహిక జీవితంపై అసంతృప్తిగా ఉండేది. తరచూ భార్య భర్త కరణ్ తో గొడవలు పడుతుండేది. రాత్రి ఇంటికి వచ్చిన భర్త కరణ్ తో అతని భార్య గొడవపడింది. ఇద్దరు గొడవపడుతుండగా, భార్య ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భర్త కరణ్ భార్యకు ముద్దిచ్చాడు.

ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా మావోల హత్యలు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:15

విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు హై అలెర్ట్ విధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలుసార్లు దాడులకు తెగబడి ప్రజాప్రతినిధులను హతమార్చిన మావోయిస్టులు.. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేతో సహా మరో మాజీ ఎమ్మెల్యేలను దారుణంగా కాల్చి చంపడం కలకలం రేపుతోంది. ఇప్పటిదాకా మావోయిస్టుల దాడుల్లో ఎంత మంది హతమయ్యారు..? ఎప్పుడెప్పుడు ఎవరు మృత్యువాతపడ్డారు..? 

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

Submitted by nanireddy on Sat, 09/22/2018 - 19:37

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన షిమ్లాకు 150 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి షిమ్లావైపు వెళుతున్న జీపు స్నేయిల్ రోడ్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అందులో నలుగురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారని షిమ్లా సూపర్డెంట్ అఫ్ పోలీస్ ఉమాపతి జాంవలీ వెల్లడించారు.

రాఫెల్ డీల్‌పై రాజుకుంటున్న వివాదం...మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 09/22/2018 - 16:54

రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌ పేరుతో మోదీ, అనిల్‌ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్‌ దాడులు చేశారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోడీ ఇప్పటికైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల ధరల విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.   

సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు....

Submitted by arun on Sat, 09/22/2018 - 12:44

కేరళలో అత్యంత సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు తీసుకుంది. అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఫ్రాంకోను అరెస్ట్‌ చేస్తున్నట్లు సిట్‌ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు.