National

పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

Submitted by arun on Sat, 11/17/2018 - 16:41

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

మహాకూటమికి గ్లామర్ బూస్ట్...ప్రచార పర్వంలోకి టాలీవుడ్ స్టార్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:55

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి సింహా దిగుతున్నాడు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో చావు లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త జోష్ ఇస్తుంది. మహాకూటమిలో కోరిన సీట్లను టీడీపీ దక్కించుకుంది. మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు. 

తెరుకుచున్న 'శబరిమల' తలుపులు

Submitted by chandram on Fri, 11/16/2018 - 19:54

మండల పూజల కోసం శబరిమల ఆలయం మరోసారి తెరుచుకుంది. భక్తుల శరణుఘోష మధ్య ప్రధాన అర్చకుడు కందరవు రాజీవరు ఆలయం ద్వారాలను తెరిచారు. ఈ సారి రెండు నెలలకు పైగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. మరోవైపు సుప్రీం ఆదేశాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అయ్యప్పను దర్శించుకునేందుకు భూమాత బ్రిగేడ్‌ సంస్థ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్‌ స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగి చూశారు. 

అలోక్ వర్మ 19 లోగా స్పందించాలి..: సుప్రీం

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:13

సీబీఐ డైర‌క్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌పై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్  ఇచ్చిన రిపోర్ట్‌పై  సుప్రీంకోర్టు స్పందించింది. ఆ నివేదిక అసంబ‌ద్ధంగా ఉంద‌ని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. సీవీసీ ఇచ్చిన నివేదిక‌ను అలోక్ వ‌ర్మ‌కు ఇవ్వాల‌ని సుప్రీం తెలిపింది. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌లో ఉన్న అంశాల‌పై అలోక్ వ‌ర్మ‌ మ‌ళ్లీ కోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీం త‌న తీర్పులో పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్  దర్యాప్తు చేపట్టింది.

అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు

Submitted by chandram on Fri, 11/16/2018 - 17:02

అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హాయ్‌ల్యాండ్ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్ ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణలో ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీపై దర్యాప్తు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సిట్ ఏర్పాటు చేసే, విచారణను తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కొత్త మలుపు తిరిగింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని మందలిస్తూ తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. 
 

రేపే ఇంజిన్‌లెస్ ట్రైన్ 18 ట్రయల్ రన్

Submitted by chandram on Fri, 11/16/2018 - 15:14

భారతీయ రైల్వే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"కు  రేపు పెద్దఎత్తున అధికారులు ట్రయల్  రన్ నిర్వహిస్తున్నారు. మొదటగా బరేలీ నుండి మొరాదాబాద్ రైల్వే లైన్లో  ట్రైన్ 18ను ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ట్రయిల్ రన్ కోసం ఆర్‌డీఎస్‌ఓ సిబ్బంది మొరాదాబాద్ కు చేరారు. కాగా ఈ రైలు రూ. 100 కోట్లతో రూపొందించారు. ఇది గంటకు 160 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ట్రైన్ 18 ప్రారంభమైతే దీన్ని శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో నడిపాలని భావిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.

మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య

Submitted by arun on Fri, 11/16/2018 - 14:45

నాన్న కొనిచ్చిన సెల్ ఫోన్ పోయిందని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక మైసూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం సోదరుడు బబ్లూతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్‌ఫోన్‌ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్‌ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తమ కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్‌ఆర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభం

Submitted by chandram on Fri, 11/16/2018 - 14:33

బెంగళూరులోని ఓ పెళ్లి వివాహ వేడుకలో నిమగ్నమైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కళ్యాణమండపం వద్ద నిలుచోని బంధువువుతో ముచ్చటిస్తున్న మహిళను గమనించిన దుండగుడు ఇదే సరైనా సమయం అనుకున్నాడేమో పక్కన ఉన్న మహిళాను తోసేసి బాధితురాలి మేడలోంచి గొలుసు లాక్కేళ్లడు దింతో మహిళ దుండుగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇంతలోనే దొంగ పరిపోయాడు. దింతో మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి

Submitted by arun on Fri, 11/16/2018 - 14:16

ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తన సిబ్బందితో చెప్పులు తుడిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీన్ని మీడియా ప్రసారం చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుంటి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 

కేరళలోని నిలక్కల్ వద్ద అయ్యప్ప భక్తుల అవస్థలు

Submitted by arun on Fri, 11/16/2018 - 13:24

శబరిమల వెళ్లిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ నుంచి 40 బస్సుల్లో భక్తులు శబరిమలకు తరలివెళ్లారు. అయితే, సన్నిధానానికి వెళ్లే దారిలో నిలక్కల్ వద్ద అటవీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంలో పోలీసులు బస్సులు నిలిపివేశారు. పంపా నది దగ్గర ఉన్న కన్నె మూల మహాగణపతి దగ్గర భక్తులంతా నిలిచిపోయారు. సుమారు 22గంటలు గడుస్తున్నా స్వామి దర్శనానికి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో దాదాపు 5వేల మంది భక్తులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.