Telangana

కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి అల్టిమేటం

Submitted by arun on Wed, 11/14/2018 - 16:19

కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి అల్టిమేటం జారీ చేసింది. జనగాం సీటు తమకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్న టీజేఎస్‌... ఈ సాయంత్రంలోగా కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాలని డెడ్‌లైన్‌ విధించింది. ఇప్పటి టీజేఎస్‌కు ప్రకటించిన వరంగల్‌ ఈస్ట్‌ సీటు విషయంలోనూ మార్పు ఉండదని తేల్చి చెప్పింది. 

జనగామపై కొనసాగుతోన్న సస్పెన్స్‌

Submitted by arun on Wed, 11/14/2018 - 16:10

65మందితో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ మరో పది మందితో సెకండ్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. కనీసం సెకండ్‌ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా జనగామ సీటు ఆశించి మొదటి లిస్టులో భంగపడిన టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ రిక్త హస్తమే ఎదురైంది. అలాగే సనత్‌‌నగర్ సీటు ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌‌రెడ్డి పేరు కూడా లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.  

గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన కేసీఆర్‌

Submitted by chandram on Wed, 11/14/2018 - 15:20

టీఆర్ఎస్‌ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వెల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సరిగ్గా 2 గంటలా 34 నిముషాలకు గజ్వెల్‌‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనుకున్న సమయానికే ఆర్డీవో కార్యాలయం చేరుకున్న ఆయన అట్టహాసాలకు దూరంగా నామినేషన్ వేశారు. కేసీఆర్‌ వెంట హరీశ్‌రావుతో పాటు మరో ఐదుగురు ముఖ్యులు మాత్రమే ఉన్నారు. కాన్వాయ్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ కేవలం మూడు కార్లలోనే ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ వేశారు. 
 

టీఆర్ఎస్ తాజా మాజీకి బీజేపీ టిక్కెట్..?

Submitted by arun on Wed, 11/14/2018 - 14:40

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. బిజెపి మూడో లిస్టులో బొడిగె శోభ పేరు వస్తుందని సమాచారం. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఆమె సోమవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా పలువురు బీజేపీలో చేరి పోటీ చేయాలని ఆమెను కోరారని తెలిసింది.
 

కూటమి పోటీ విషయంలో అమరావతిలో లిస్ట్ రెడీ అవుతుంది

Submitted by arun on Wed, 11/14/2018 - 13:49

తమకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్. గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు  నివాళులర్పించిన ఇంటి పార్టీ నేతలు అక్కడ నిరసనలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో బీసీలు కీలక పాత్ర పోషించారని, అయినా, వారికి సీట్ల కేటాయింపులో అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల జాప్యానికి కోదండరామ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణమన్నారు. కూటమి పోటీ విషయంలో అమరావతిలో లిస్ట్ రెడీ అవుతుందని, ఇంటి పార్టీని ముందు నుంచి కాంగ్రెస్ దూరం చేయాలని చూసిందని చెరుకు సుధాకర్ ఆరోపించారు. తాను హుజూర్ నగర్ నుంచి పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న తెలంగాణ మంత్రి

Submitted by arun on Wed, 11/14/2018 - 13:33

మంత్రి మహేందర్  రెడ్డి నోరు జారారు.  రంగారెడ్డిజిల్లా  తాండూర్  మండలం ఉద్దండాపూర్ లో విస్తృత  ప్రచారం చేస్తున్న టైంలో టంగ్  స్లిప్  అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టే గెలుస్తుందన్న ఆయన వెంటనే తప్పును తెలుసుకుని నాలుక కరుచుకోవడం వైరల్ గా మారింది. 

హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

Submitted by arun on Wed, 11/14/2018 - 13:22

ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్న సీఎం కేసీఆర్ గజ్వేల్ దగ్గర కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మధ్యాహ్నం కోనేటి రాయుడి ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచారు. కేసీఆర్‌తో  పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు.

రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు...

Submitted by arun on Wed, 11/14/2018 - 12:50

మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ మరోసారి మొండి చేయి చూపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌.. 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది.

ఫోన్‌ పోయింది.. మందు బాబు వీరంగం..

Submitted by chandram on Wed, 11/14/2018 - 12:25

మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. దింతో చాకచాక్యంగా పోలీసులు మందుబాబుని సురక్షితంగా కాపాడి ఇంట్లో అప్పచేప్పారు. నిజామాబాద్ జిల్లా దమ్మన్నపేట గ్రామస్థుడు తప్పతాగిన మైకంలో ధర్పల్లి గ్రామంలో నీళ్ల ట్యాంక్ ఎక్కి నానా వీరంగం చేశాడు. వివరాల్లోకి వెళితే ధర్పల్లి వద్ద చాయ్ దుకాణం వద్ద ఇద్దరు కానిస్టేబుల్ టీ తాగుతుండగా తులసీనారాయణస్వామి నా సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు వివరించి, ఎలాగైన నా ఫోన్ మీరే వెతికి తిరిగి అప్పగించాలని పోలీసులను కోరారు.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Submitted by arun on Wed, 11/14/2018 - 11:37

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది.  కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది.