Telangana

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:54

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్ తగిలింది. టికెట్ దక్కలేదని నిరాశతో అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గూలాబీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పాడి కౌశిక్‌రెడ్డికి ఇవ్వడంతోనే అసంతృప్తితోనే తాము గూలాబీ తీర్ధం పుచ్చుకున్నామని నేతలు తెలిపారు.

గద్దర్ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:43

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెబుతున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదని అర్థమౌతుంది. కాగా గద్దర్ తనయుడు సూర్యం బెల్లంపల్లి నుండి శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసినా కాంగ్రెస్ మాత్రం మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించింది. కాగా ఇటు గద్దర్ కు,కుమారుడికి అన్యాయం జరిగిందనే భావనలో గద్దర్ ఉన్నట్లు విశ్లేశకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ తో గద్దర్ మంతనాలు జరిపిన ఫలితం దక్కలేదు.

బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదని..

Submitted by arun on Tue, 11/20/2018 - 13:59

ప్రైవేటు స్కూళ్లల్లో అరాచకాలు శృతిమించుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని కేకే రెడ్డి అనే ప్రైవేటు స్కూల్‌లో హాస్టల్‌ వార్డెన్‌ ఏకంగా 130 మంది విద్యార్థులను చితక్కొట్టాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా చేతులు, కాళ్లపై కట్టెలు విరిగేలా కొట్టారు. వార్డెన్‌ కొట్టిన దెబ్బలకు తాళలేక చాలామంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

కాంగ్రెస్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు...ఆ సభకు వెళ్లకుంటే రూ.25 లక్షలు...

Submitted by arun on Tue, 11/20/2018 - 13:41

ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో నిన్న అర్ధరాత్రి నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించిన ఒవైసీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను నిర్మల్‌ సభకు హాజరవకుండా ఉంటే పాతిక లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేశారని చెప్పారు. దానికి సంబంధించిన ఫోన్‌ రికార్డులు కూడా తన దగ్గరున్నాయని వివరించారు. తనను ఎవరూ కొనలేరని మీరు కూడా మోసపోకండని చెప్పుకొచ్చారు. అందరూ స్వచ్ఛంధంగా టీఆర్ఎస్‌కు ఓటెయ్యాలంటూ అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. 

హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Submitted by arun on Tue, 11/20/2018 - 12:52

 హైదరాబాద్ ఓ కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎన్టీఆర్‌ ఘాట్‌ రోడ్డులోని లుంబినీ పార్క్‌ వద్ద ఇవాళ తెల్లవారు జామున చోటు చేసుకుంది. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో కారు యూ టర్న్ తీసుకుంటుండగా కారు హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. నీళ్లలో ఉన్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తా, లేక మద్యం మత్తా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక రంగంలోకి స్టార్‌ క్యాంపెయినర్లు

Submitted by arun on Tue, 11/20/2018 - 11:52

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ జాబితాను తయారు చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాయి. పార్టీ, పదవి తదితర వివరాలు లేఖల్లో ప్రస్తావించాయి. టీఆర్‌ఎస్‌ తరఫున పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు 15 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను సమర్పించారు.

చివరి నిమిషంలో మనస్సు మార్చుకున్న టీడీపీ

Submitted by arun on Tue, 11/20/2018 - 11:36

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలనుకున్న టీడీపీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. 24 సీట్లలో పోటీ చేయాలని భావించిన టీడీపీ మహాకూటమి సీట్ల సర్ధుబాటులో 14 సీట్లలో పోటీకి సిద్ధమయ్యింది. అయితే, నామినేషన్ల పర్వం ముగిసే వరకు 13 మంది అభ్యర్ధులకు మాత్రమే బీ ఫారాలు అందచేసింది. 

రూటు మార్చిన సీఎం కేసీఆర్

Submitted by arun on Tue, 11/20/2018 - 11:23

మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. మాటల తూటాలను పక్కన బెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా ప్రచారం చేపట్టారు. పేద ప్రజలు, రైతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రసంగించిన కేసీఆర్‌ మరో సారి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. కులం వద్దు మతం వద్దు అంటూనే ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త వరాలను ప్రకటించారు.  

టీకాంగ్రెస్‌‌కు దడ పుట్టిస్తున్న రెబల్స్‌

Submitted by arun on Tue, 11/20/2018 - 11:13

నిన్నమొన్నటి వరకు మహా కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త  తలనొప్పి వచ్చిపడింది. నామినేషన్ల గడువు ముగియడంతో పార్టీ రెబల్స్ బెడద ఆందోళన కల్గిస్తోంది. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు తిరుబాటు అభ్యర్దులుగా రంగంలోకి దిగడంతో వాళ్లందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

రెబల్ అభ్యర్దులపై గులాబీ బాస్ గుర్రు

Submitted by arun on Tue, 11/20/2018 - 11:00

టీఆర్ఎస్ తరపున రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసినవారిపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారా... ? పార్టీ లైన్ దాటి ముందుకెళ్లిన నేతలపై వేటు తప్పదా..? కేసీఆర్ నిర్ణయాన్ని దిక్కరించి పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడంపై గులాబీ పార్టీలో ఏం చర్చ నడుస్తోంది.

Tags