Telangana

అభిమానమే గట్టయ్యను కుటుంబాన్ని రోడ్డున పడేసింది...అభిమానులారా... ఒక్కసారి ఆలోచించండి.!!

Submitted by arun on Wed, 09/19/2018 - 11:28

నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య చనిపోయాడు. అభిమాన నాయకుడు ఆశించిన టిక్కెట్‌ రాలేదన్న బాధతోనే కన్నుమూశాడు. స్థానికుడికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్‌ ఎలా ఇస్తారంటూ పెట్రోలు పోసుకున్న గట్టయ్యను మృత్యుదేవత గట్టెక్కనివ్వలేదు. తనతో పాటే తీసుకుపోయింది. మొత్తంగా ఈ ఘటనలో గట్టయ్య సాధించేదేమిటి?

ఇందారంలో ఉద్రిక్తత...బాల్కసుమన్, ఓదేలు వచ్చి, గట్టయ్య కుటుంబాన్ని...

Submitted by arun on Wed, 09/19/2018 - 11:01

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. ఓదేలుకు టికెట్‌ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్యకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, బాల్కసుమన్, ఓదేలు వచ్చి.. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదిలేదని బంధువులు అంటున్నారు. గట్టయ్య ఇద్దరు పిల్లలకు చెరో ఇరవై లక్షలు ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.   

హత్య కేసులో కొత్త కోణాలు

Submitted by arun on Wed, 09/19/2018 - 10:18

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసిన ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితులు దొరకడంతో హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ప్రణయ్ హత్యకు రెండు సార్లు యత్నించి విఫలమైనట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు..అమృతకు అబార్షన్ చేయించేందుకు కూడా ఆమె తండ్రి విఫలయత్నం చేశాడు.

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మారుతీరావు మాస్టర్ ప్లాన్...దృశ్యం సినిమా తరహా ...

Submitted by arun on Wed, 09/19/2018 - 10:03

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అమృత తండ్రి మారుతీరావు మాస్టర్ ప్లానే వేశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌కు త్వరగా బెయిల్ వచ్చేఅవవాశముందని పోలీసులు చెప్పడంపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. బాబాయ్ బయటికి వస్తే తనకు ప్రాణహాని ఉందని అంటోంది. 

తన ఇల్లు, సంస్థలపై జరిగిన ఐటి దాడులపై స్పందించిన ఖమ్మం ఎంపీ

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:55

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 18చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో  తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంభందించి ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త గూడెంలోని ఎంపీ అనుచర కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లపై కూడా ఐటి దాడులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఐటీ దాడులపై స్పందించారు.  తన ఇంటిపై జరిగినవి ఐటీ దాడులు కావని, ప్రతీ ఐదేళ్లకోసారి జరిగే సాధారణ ప్రక్రియ అని సమాధానమిచ్చారు. 

నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి

Submitted by arun on Tue, 09/18/2018 - 15:53

టీఆర్ఎస్‌ కార్యకర్త, నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతిచెందాడు. ఓదెలుకు టిక్కెట్‌ ఇవ్వాలంటూ.. ఈ నెల 12 న ఆయన పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలును కాదని.. బాల్క సుమన్‌కు టిక్కెట్‌ ఇవ్వడంపై ఆయన వర్గం ఆందోళన చేపట్టింది. ఈ నెల 12 న బాల్క సుమన్‌ ర్యాలీలో గట్టయ్య పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ప్రాణాలు కోల్పోయాడు. 

ప్రణయ్ హత్య కేసులో వీడిన సస్పెన్స్...నల్గొండ పోలీసుల అదుపులో కీలక నిందితుడు

Submitted by arun on Tue, 09/18/2018 - 13:39

ప్రణయ్ హత్య కేసులో సస్పెన్స్ వీడింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక నిందితుడు శుబాష్ శర్మను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను కత్తితో నరికిచంపిన శర్మను.. బీహర్ పోలీసుల అనుమతితో నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మను బీహార్ లోని సమస్థీపూర్ కోర్టులో హాజరుపరిచారు. కోరు అనుమతి లబించడంతో నిందితుడు శర్మను నల్గొండకు తరలిస్తున్నారు. ప్రణయ్ హత్యకేసులో బీహర్ గ్యాంగ్ దే కీలక పాత్ర అని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ తెలిపారు. 

ప్రణయ్‌ హత్యలో మాజీ ఎమ్మెల్యే హస్తం? వీరేశంను కూడా విచారిస్తున్నారా?

Submitted by arun on Tue, 09/18/2018 - 13:16

సంచలనం సృష్టించన ప్రణయ్ హత్యకేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్యకు మొత్తం కోటి రూపాయాల ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసుకుందన్నారు. అడ్వాన్స్ గా 18 లక్షలు తీసుకున్నారని విచారణలో తేలినట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన వ్యక్తేనని తెలిపారు. నరిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తున్నామని నల్గొండకి చెందిన ఐఎస్ఐఎస్ మాజీ టెర్రరిస్టులకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉందన్నారు. 
  

ఫేస్‌బుక్‌ వేదికగా అమృత పోరాటం

Submitted by arun on Tue, 09/18/2018 - 11:42

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తండ్రి కుల దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమాన్ని ఆరంభించింది. హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించింది. ‘ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది. మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరింది.

ప్రాణం తీసిన భూ రికార్డుల తప్పిదాలు

Submitted by arun on Tue, 09/18/2018 - 11:27

మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలం రాజారాంలో భూరికార్డుల తప్పిదాలకు ఒకరు బలయ్యారు. లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని.. శ్యామల పేరుపై అధికారులు రికార్డులో నమోదు చేశారు. దీంతో తనకు భూమి దక్కదేమోనని ఆందోళన చెందిన లక్ష్మి పురుగులమందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన శ్యామల, తనపై కేసు నమోదు అవుతుందనే భయంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  ప్రసుత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల పరిస్థితి విషమంగా ఉంది.