Anantapur

భగ్గుమన్న తాడిపత్రి

Submitted by arun on Mon, 09/17/2018 - 10:49

 అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రబోదానందస్వామి భక్తులకు జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.  వినాయక నిమజ్జన సమయంలో రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారి 48 గంటలు గడుస్తున్నా పరిస్ధితులు ఇంకా సద్దుమణగలేదు.  చిన్నపడమల, పెద్దపడమల గ్రామాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల కు చెందిన పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట భైఠాయించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ప్రబోదానందస్వామి ఆశ్రమాన్ని సీజ్ చేయాలంటూ పట్టుబట్టారు.  పట్టణంలో 144వ సెక్షన్ విధించిన పోలీసులు వినాయక నిమజ్జన వేడుకలను వాయిదా వేశారు.

ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడి

Submitted by arun on Sat, 07/28/2018 - 13:13

అనంతపురం ఎస్‌బీఐలో భారీ చోరీ జరిగింది. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌‌ను కట్‌ చేసిన ఇద్దరు దొంగలు 41లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బ్యాంకులో మొత్తం 26 సీసీ కెమెరాలు ఉండగా, 10 సీసీ కెమెరాలను పగులకొట్టారు. అయితే మిగతా కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
 

ఇంట్లో దెయ్యం ?

Submitted by arun on Fri, 07/06/2018 - 13:13

నిప్పు లేకుండానే మంటలొస్తాయా? ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు మూడు నెలలుగా మిస్టరీ మంటలు ఓ గ్రామాన్ని వణికిస్తున్నాయి. మూడిళ్లలో మూడు నెలలుగా మంటలు చెలరేగుతున్నాయి. మంటల వెనుక మిస్టరీ అర్థంకాక బాధిత కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఇది దెయ్యం పనిగా కొందరు చెబుతున్నారు. 

Tags

నిప్పు లేకుండానే మంటలు...దయ్యమే కారణమంటున్న గ్రామస్తులు

Submitted by arun on Thu, 07/05/2018 - 15:55

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి  గ్రామంలో నిప్పు లేకపోయినా మంటలు చెలరేగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో  ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు రేగుతున్నాయి. మూడు నెలులగా ఇంట్లోని సర్వస్వం బూడిద అవుతున్న ఈ మంటలు ఆగడం లేదు. వీటి బారినుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక పిల్లాపెద్దలు నిత్యం జాగారం చేస్తున్నారు.

జోరుగా వజ్రాల వేట

Submitted by arun on Sat, 06/16/2018 - 16:10

ఇక తొలకరి జల్లులు పలకరించడంతో  అనంతపురం జిల్లాలోనూ వజ్రాల వేట ప్రారంభమయ్యింది. వజ్రకరూర్ మండలంలోని పలు గ్రామాల్లో  స్ధానికులు పోలాలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా ఓ వజ్రం  దొరకకపోతుందా అంటూ ఆశగా అన్వేషణ సాగిస్తున్నారు. తొలకరి జల్లులు కురవగానే అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతుంటే ... వజ్రకరూర్‌‌లో మాత్రం స్ధానికులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పొలాల్లో తిష్టవేశారు. తెల్లవారుజాము నుంచి మసకమసక చీకటి పడే వరకు పోలాల్లోనే ఉంటూ రంగరాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ముసలి, ముతక, ఆడ, మగా, చిన్నా, పెద్ద తేడా లేకుండా రోజుల తరబడి పొలాల్లోనే ఉంటూ వజ్రాల వేట సాగిస్తున్నారు. 

చిన్నారి ప్రాణాలు తీసిన జెయింట్ వీల్

Submitted by arun on Mon, 05/28/2018 - 12:16

అనంతపురం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఉన్న జెయింట్ వీల్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆనందాన్ని ఇస్తుందని ఆ జెయింట్ వీల్ ను ఎక్కిన చిన్నారులకు చేదు జ్ఞాపకాన్ని ఇచ్చింది. అలాగే ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి.
అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన రోబో ఎగ్జిబిషన్ లో జరిగిన ప్రమాదంలో అమృత అనే 8 ఏళ్ళ చిన్నారి మరణించింది. మరో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. వీరు ఎక్కిన భారీ జెయింట్ వీల్ బోల్ట్ వదులై..ఒక్కసారిగా రెండు బాక్సులు ఊడి 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాయి.

జనసేన ఆపరేషన్ ఆకర్ష్ షురూ..జేసీకి జనసేన ఆహ్వానం..?

Submitted by arun on Thu, 04/12/2018 - 11:46

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని చాలా కాలం కిందటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఒకసారి జిల్లాలో పర్యటించిన పీకే.. మరోసారి అనంతలో టూర్‌కి సన్నాహాలు చేస్తున్నారు. తన పోరాటాలకు కేంద్రంగా పవన్ అనంతపురం జిల్లాను ఎంచుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ప్రారంభమై నాలుగేళ్లయినా ఏ ఒక్కరూ ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జనసేనలోని కీలకనేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ప‌రిటాల కుటుంబంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Submitted by lakshman on Sun, 01/28/2018 - 12:03

పవన్ అనంతపురం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడంపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ హిందూపురాన్నే తన రాజకీయ కేంద్రంగా ఎంచుకున్నారు. తన సొంత ఊరుతో పాటు తిరుపతిని కూడా కాదని అనంత నుంచే ఆయన శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాజాగా జనసేనాధినేత పవన్‌కల్యాణ్‌ అనంతపురం నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

నా ఆఖరి శ్వాస వరకు సీమకు అండగా ఉంటా

Submitted by arun on Sat, 01/27/2018 - 13:10

రాయలసీమ సమస్యలపై తన తుది శ్వాస వరకూ పోరాడతానన్నారు పవన్‌‌. రాయలసీమ అంటే తనకు రక్తపాతం, ఫ్యాక్షనిజం కనిపించదన్న జనసేనాని సీమ పేరు చెబితే సస్యశ్యామలమైన ప్రాంతమే గుర్తుకొస్తుందన్నారు. రాయలసీమ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్న పవన్‌‌ ప్రత్యేక రైలులో ఢిల్లీ యాత్ర చేపడదామన్నారు.  ‘చలోరే.. చలోరే’ కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను జీవితంలో మరచిపోలేనని అన్నారు.