vizag

నేడు సాగర తీరంలో జనసేన భారీ కవాతు

Submitted by arun on Sat, 07/07/2018 - 07:25

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కవాతు నిర్వహించనున్నారు. కవాతులో అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఆర్కే బీచ్ కాళీ మందిర్ నుంచి వైఎంసీఏ వరకు కవాతు సాగనుంది. ఈ కవాతులో ఆరెంజ్, ఆలీవ్ గ్రీన్, వైట్ డ్రెస్‌లలో జన సైనికలు పాల్గొననున్నారు. ఆరెంజ్ కోడ్ వివకానందుడు స్పూర్తిగా, ఆలీవ్ గ్రీన్ సైనికులు, భగత్ సింగ్ స్పూర్తిగా వైట్‌డ్రెస్ కోడ్‌తో అభిమానులు ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను గళమెత్తడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ర్యాలీని ఎంచుకున్నారు పవన్‌ కల్యాణ్‌.
 

ప్రపంచంలోనే పెట్టుబడుల గమ్య స్థానం ఏపీ

Submitted by arun on Sat, 02/24/2018 - 17:01

ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టామని, ఆ రంగంలో 25.6 శాతం అధిక వృద్ధిని సాధించామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్‌పై దృష్టి పెట్టామని, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పరిశ్రమల ప్రోత్సాహానికి వీలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. 

యోగా మాస్టర్‌ దారుణ హత్య

Submitted by arun on Sat, 01/27/2018 - 12:19

స్మార్ట్‌ సిటీ విశాఖలో దారుణ హత్య జరిగింది. యోగా మాస్టర్‌‌ వెంకటరమణ హత్యకు గురయ్యాడు. నలుగురు దుండగులు ఇనుప రాడ్లతో కొట్టిచంపారు. ఈ మర్డర్‌ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డవడంతో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక సాయంకాలం దినపత్రిక విలేకరి హస్తముందని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 

తొమ్మిది పుంజులపై కేసు..

Submitted by arun on Thu, 01/25/2018 - 17:34

మనుషులు చేసిన తప్పులకు... పుంజులు శిక్ష అనుభవిస్తున్నాయా ? స్వేచ్ఛగా ఉండాల్సిన కోడిపుంజులు స్టేషన్‌లో ఎందుకున్నాయ్ ? జీడిపప్పు, బాదంపప్పు తిన్న కోళ్లకు... ఫుడ్డే కరువయింది. పందెంరాయుళ్లు వ్యక్తిగత పూచికత్తుపై విడుదలయ్యారు ? మరీ కోడిపుంజులు ఏం నేరం చేశాయ్. పందెంరాయుళ్లు నేరం చేస్తే.... పుంజులెందుకు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నాయ్.