komatireddy venkat reddy

కోమటిరెడ్డి, సంపత్‌ ఇష్యూలో కేసీఆర్‌‌ నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?

Submitted by arun on Tue, 04/24/2018 - 14:17

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు? శాసన సభ్యత్వాల పునరుద్ధరణకు చర్యలు చేపడతారా? లేక కోర్టు తీర్పును అధిగమించేందుకు ప్రయత్నిస్తారా? ఇంతకీ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశాన్ని కేసీఆర్‌ ఎలా డీల్‌ చేయబోతున్నారు?

హైకోర్టు తీర్పును.. అసెంబ్లీ పాటిస్తుందా.?

Submitted by arun on Thu, 04/19/2018 - 11:20

హైకోర్టు తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్‌కు అసెంబ్లీకి రూట్ క్లియర్ అయినట్లేనా మాజీ ఎమ్మెల్యేలుగా సభ నుంచి బయటికొచ్చిన నేతలు మళ్లీ ఎమ్మెల్యేలుగా లోపల అడుగుపెడతారా..? ఇది పక్కనబెడితే.. హైకోర్టు తీర్పును.. అసెంబ్లీ పాటిస్తుందా.? గత సంఘటనలు ఏం చెప్తున్నాయ్.?

‘కేసీఆర్‌కు ఆ తీరిక కూడా లేదు’

Submitted by arun on Sat, 04/14/2018 - 15:55

సీఎం కేసీఆర్‌కు... అంబేద్కర్ కి నివాళులు అర్పించే అంత తీరిక లేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి  అన్నారు. నల్లగొండలోని కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తుంటే, కేసీఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్ లోనే ఉంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం కేసులో హైకోర్టు సీరియస్

Submitted by arun on Tue, 04/03/2018 - 16:13

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వం రద్దుపై జరిగిన విచారణలో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని హై కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కోర్టు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. శాసనసభలో క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వం రద్దు చేసిన కేసు కొలిక్కి రావడం లేదు. ఈ ఘటనపై జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కేసు మళ్లీ వాయిదా పడింది. 

నన్ను చంపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

Submitted by arun on Wed, 03/21/2018 - 13:15

మాజీ మంత్రి, శాసనసభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తమకు గన్ మెన్లను తొలగించడం ఈ కుట్రలో భాగమేనని అన్నారు. తనకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేంత పిరికిపందను కానని చెప్పారు. కేసీఆర్ నీ బుల్లెట్ కంటే నా గుండె చాలా గట్టిదని అన్నారు. ఈ ఉదయం సంపత్ తో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీరిద్దరూ ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు.

‘కేసీఆర్‌కు మమత బెనర్జీ మొట్టికాయలు వేశారు’

Submitted by arun on Tue, 03/20/2018 - 16:23

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ థర్డ్ ఫ‌్రంట్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక వైపు మోడికి మద్దతిస్తూ మరోవైపు థర్డ్ ఫ్రంట్‌ అంటే ఎలా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించేందుకు కూర్చి వేసుకుని నీళ్లు తీసుకొస్తానన్న కేసీఆర్‌...ఆ సమస్యను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నిన్న కోల్‌కతాకు వెళ్లిన కేసీఆర్‌కు మమత బెనర్జీ మొట్టికాయలు వేశారన్నారు. మోదీకి మద్దతు తెలుపుతూ థర్డ్ ఫ్రంట్ అంటే ఎలా అని మమత కేసీఆర్‌ను నిలదీశారన్నారు. మమత బెనర్జీది సాధారణ జీవితం అని, ఆమెను చూసైనా కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలన్నారు.

కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట

Submitted by arun on Mon, 03/19/2018 - 17:11

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాలపాటు ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఈసీని ఆదేశించింది. శాసన సభ్యత్వాల రద్దు కేసులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌‌‌లకు స్వల్ప ఊరట లభించింది. శాసన సభ్యత్వాల రద్దు‌ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శాసన సభ్యత్వాలు రద్దుచేసిన రెండు స్థానాల్లో ఆరు వారాలపాటు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని, అలాగే ఎలాంటి ఎన్నికల ప్రక్రియ చేపట్టొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఉప ఎన్నికల లక్ష్యం ఇదేనట..!

Submitted by lakshman on Thu, 03/15/2018 - 08:13

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం.. ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతలోనే.. రాష్ట్రంలో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని సభ రద్దు చేసేసింది. ఇప్పుడు ఇంకో రెండు సీట్లు ఖాళీ అవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.

‘టీ’ అసెంబ్లీ గొడవలో.. ఫినిషింగ్ టచ్ ఉందట..!

Submitted by lakshman on Thu, 03/15/2018 - 07:57

గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గలాటాతో.. తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు ఊహించని శిక్షను ఎదుర్కొన్నారు. ఉన్న పదమూడు మందిలో.. 11 మందిని సభ నుంచి బడ్జెట్ సెషన్ కు సస్పెండ్ చేసేశారు. మిగతా ఇద్దరు కోమటిరెడ్డి, సంపత్ లను ఏకంగా సభ నుంచే బహిష్కరించారు. టెక్నికల్ గా చెప్పాలంటే.. సభ్యత్వాన్ని రద్దు చేశారు. అక్కడితో అయిపోయిందని అనుకుంటే పొరబాటే.