komatireddy venkat reddy

కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు

Submitted by arun on Thu, 09/20/2018 - 17:11

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని... ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
 

టీడీపీతో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Submitted by arun on Thu, 09/13/2018 - 16:14

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. పొత్తుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిశితంగా వివరిస్తానని చెప్పారు. మహాకూటమిలోని పక్షాలను కేవలం పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

బ్రేకింగ్... హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురుదెబ్బ!

Submitted by arun on Tue, 08/21/2018 - 12:35

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను శాసనసభ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశాక ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో రోజుకో మలుపు తిరుగుతోంది. వాళ్లిద్దరినీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని సింగిల్ బెంచ్ గతంలో ఆదేశించింది. ఐతే.. ఇవాళ ఈ కేసును విచారించిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై రెండు నెలలు స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో  తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.

కవితను మళ్లీ గెలిపిస్తే రాజకీయ సన్యాసం..

Submitted by arun on Fri, 07/06/2018 - 15:37

నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలలో 40శాతం వాటా కేసీఆర్ కుటుంబసభ్యులదేనని కోమటిరెడ్డి ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేస్తున్నారని, ఆమె చెల్లెను గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

ఇదేం పద్ధతి..? కోమటిరెడ్డికి జానా క్లాస్‌

Submitted by arun on Sat, 06/09/2018 - 13:09

కాంగ్రెస్‌ రెబల్‌స్టార్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో జానా ఆగ్రహంతో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో  కోమటిరెడ్డి తన తీరును మార్చుకోవాలని జానా హెచ్చరించినట్లు తెలిసింది. బహిరంగంగా ఎలా ప్రశ్నిస్తావంటూ నిలదీసినట్లు సమాచారం. 

కోమటిరెడ్డి వ్యాఖ‌్యలతో కాంగ్రెస్‌లో కలకలం

Submitted by arun on Wed, 06/06/2018 - 13:16

టీ కాంగ్రెస్‌ రెబల్‌స్టార్‌ కోమటిరెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారా ? పార్టీలో ఇమేజ్‌ పెంచుకునేందుకు రాజీనామాల అస్త్రం ప్రయోగించనున్నారా ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లను...ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గుర్తించకపోతే ఫ్యూచర్‌ ప్లానేంటీ ? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే...ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? ఇంతకీ గాంధీభవన్‌లో ఏం జరుగుతోంది. 

కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించకపోతే రేపు హైకోర్టులో మరో పిటిషన్ వేస్తా : కోమటిరెడ్డి

Submitted by arun on Tue, 06/05/2018 - 17:40

తన శాసనసభ సభ్యత్వంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించకపోతే రేపు హైకోర్టులో మరో పిటిషన్ వేస్తానన్నారు. నల్గొండకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. కోమటిరెడ్డి విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

Submitted by arun on Mon, 06/04/2018 - 16:34

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును కొట్టివేసిన హైకోర్టు.. తాజాగా అప్పీల్‌ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. టీఆర్ఎస్ పిటిషన్‌ విచారించ దగినదా.. లేదా.. అనేదానిపై వేసవి సెలవుల ముందు వాదనలు విన్న ధర్మాసనం.. ఇవాళ తీర్పునిచ్చింది.

ముందు నేనే రాజీనామా చేస్తా: జానారెడ్డి

Submitted by arun on Mon, 06/04/2018 - 14:54

ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సీఎల్పీ నేత జానారెడ్డి స్పందించారు. రాజీనామాల అంశం తనకు తెలియదని... ఆ విషయాన్ని కోమటిరెడ్డి ఇప్పుడే ప్రస్తావించారని హెచ్ఎంటీవీతో చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలపై పార్టీలో చర్చిస్తామని... పీసీసీ అధ్యక్షుడు, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటే అలాగే ముందుకెళ్తామన్న జానారెడ్డి... రాజీనామా చేసేందుకు తానెప్పుడూ ముందుంటానని చెప్పారు.

నన్ను ఎమ్మెల్యేగా గుర్తించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి

Submitted by arun on Wed, 05/23/2018 - 14:25

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి సీఎం లేఖ పంపారు. ‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’. అని లేఖలో పేర్కొన్నారు. లేఖపై స్పందించిన కోమటిరెడ్డి వెంటకట్‌రెడ్డి తనకు శభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.