Municipal chairperson

ఊహించని మలుపు తిరిగిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస పరీక్ష

Submitted by arun on Thu, 08/02/2018 - 10:59

బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ జరగాల్సి ఉండగా  చైర్‌పర్సన్ సునీతరాణి తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసిన ఆమె తన రాజీనామాను అందజేశారు. అయితే రాజీనామా ఆమోదం పొందకపోవడంతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. సమావేశంలో చైర్‌పర్సన్ రాజీనామాను ఆమోదిస్తే ఓటింగ్ రద్దు చేయాలని లేని పక్షంలో ఓటింగ్ నిర్వహించాలని కలెక్టర్ భావిస్తున్నారు. దీంతో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

లావణ్య పదవి ఊడింది!

Submitted by arun on Tue, 07/24/2018 - 15:36

రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్‌ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా మొత్తం 30 మంది సభ్యుల్లో ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్‌లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్‌పర్సన్‌గా పాలన కొనసాగారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

ప్ర‌భుత్వంలో కాకపుట్టిస్తున్న పావని పర్సంటేజీల వ్య‌వ‌హారం

Submitted by arun on Wed, 03/21/2018 - 10:35

ఒక్క స్టేట్‌మెంట్ ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పుడు స్టేట్ స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కమీషన్లపై సిరిసిల్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారాయి. మంత్రి సూచనల మేరకే పర్సంటేజీలు తీసుకుంటున్నామని పావని చెప్పడంపై సిరిసిల్ల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సిరిసిల్లకు ఇప్పటివరకు ఎన్నికోట్లు కేటాయించారు ఎంతమేర అభివృద్ధి జరిగింది. వాస్తవంలోకి వెళ్తే తెలుస్తున్నదేంటి.? 

కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి

Submitted by arun on Thu, 01/25/2018 - 10:52

కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి కూతవేటు దూరంలోనే  శ్రీనివాస్‌ను దుండగులు చంపేశారు. గొడవ జరుగుతోంది ఆపుదాం రమ్మంటూ అర్థరాత్రి శ్రీనివాస్‌ని తీసుకెళ్లిన దుండగులు ఇంటికి సమీపంలోనే రాళ్లతో కొట్టిచంపారు. అత్యంత పాశవికంగా తల, ముఖం చిద్రంచేసి డ్రైనేజీలో పడేశారు. భర్త దారుణహత్యతో ఆయన భార్య నల్గొండ మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి కుప్పకూలిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.