women

మగవారి ఒక సంవత్సర కాలం

Submitted by arun on Fri, 10/26/2018 - 16:58

మనుషులు తమ కాలన్ని రకరకాల పనుల్లో ఖర్చు చేస్తుంటారు.. అయితే ముఖ్యంగా మగవారిలో.. ఇది కొంచెం ప్రత్యేకమే.. ఒక సాధారణ మగ మనిషి తన జీవితంలో ఒక సంవత్సర కాలం సమయాన్ని ఇతర స్త్రీలను చూస్తునే తన కాలం గడిపెస్తాడట అని ఈ మద్య వచ్చిన ఒక అధ్యయనంలో అంటున్నారు. అందుకేనేమో ... ఎంతవరులైన.. కాంత దాసులే అన్నారు ఆ రోజుల్లోన్నే. శ్రీ.కో.

Tags

శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

Submitted by arun on Fri, 09/28/2018 - 12:50

రెండు రోజులుగా సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోన్న సుప్రీంకోర్టు నేడు కూడా మరో కీలక తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై  మహళాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ ఆరోపణలు రుజువు చేస్తే ఉరేసుకుంటా: బాల్క సుమన్‌

Submitted by arun on Sat, 07/07/2018 - 07:15

తన రాజకీయ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక బురద జల్లుతున్నారని ఎంపీ బాల్క సుమన్‌ తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర ఉరేసుకుంటానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం ఒక ప్రకటనలో సుమన్‌ స్పందించారు. ‘మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. 6 నెలల కిందట సంధ్య నన్ను మోసం చేయాలన్న ఆలోచనతో నా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలో.. భార్య స్థానంలో సంధ్య తన ఫొటోను మార్ఫింగ్‌ చేసింది. నన్ను బ్లాక్‌మెయిల్‌ కూడా చేసింది. ఈ విషయంపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్లో జనవరి 27న ఫిర్యాదు చేయగా..

పోలీసుల అదుపులో మహిళా కిడ్నాపర్ ..

Submitted by arun on Thu, 07/05/2018 - 10:48

కోఠి మెటర్నిటీ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్  చేసిన మహిళను పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితురాలు నైనారాణిని బీదర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి... హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నైనా బీదర్‌లోని షాగంజ్‌లో నివాసం ఉంటోంది. ఆమె భర్త సైమన్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తనకు రెండుసార్లు గర్భస్రావం అయిందని, భవిష్యత్తులో పిల్లలు పుట్టరన్న అనుమానంతోనే చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు నైనా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు వివరించింది.

నాగార్జున ఇంటి ముందు యువతి హల్ చల్!

Submitted by arun on Wed, 07/04/2018 - 11:48

టాలీవుడ్ నటుడు నాగార్జున ఇంటి వద్ద అర్ధరాత్రి ఓ యువతి నానా హంగామా చేసింది. ఈ హీరో తనకు నాలుగు కోట్ల రూ‌పాయలు ఇవ్వాలంటూ రభస చేసింది. దీంతో షాకైన సెక్యూరిటీ.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది.  హీరో నాగార్జునను కలవాలని..తనతో మాట్లాడాలని నాగ్ పీఏని కోరింది.  కానీ ఆయన లేరని..షూటింగ్ పనిపై బయటకు వెళ్లారని అక్కడ సిబ్బంది తెలిపారు. అయినా నాగార్జునను ఎందు కలవాలని కోరుకుంటున్నారి ఆయన పీఏ మహిళలను అడిగారు.

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు..

Submitted by arun on Fri, 06/15/2018 - 11:04

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు.. వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్‌పై పడేశారు. ఈ భయానక మర్డర్ జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. అది కూడా.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రాంగణంలోనే. మానసిక రోగులకు చికిత్స జరగాల్సిన చోట.. మర్డర్ ఎందుకు జరిగింది.? 

మహిళలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారా?

Submitted by arun on Sat, 04/07/2018 - 14:38

నిజమా... లేడీస్‌ జీన్స్‌ వేసుకోవద్దా? వేసుకుంటే నపుంసకులు పుడతారా? ఆశ్చర్యపోతున్నారా? అసలు కేరళ ప్రొఫెసర్‌ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు? పుట్టకతోనే హిజ్రాలుగా పుడతారా? ఇంటర్‌ సెక్స్‌ అనే అరుదైన కేసుకు జీన్స్‌కు ఎందుకు లింక్‌ పెట్టారు?

పేరు డాక్టర్‌ రజిత్‌కుమార్‌. కేరళలో ప్రొఫెసర్‌. అధ్యాపక వృత్తిలో ఉన్న రజిత్‌కుమార్‌ అంత చదువుకొనీ ఇలా మాట్లాడరని చర్చించుకుంటుంది మహిళాలోకం. కేరళలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ తీసుకుంటున్న రజిత్‌కుమార్‌ తమను తీవ్రంగా అవమానంచారంటారు ట్రాన్స్‌జెండర్లు. 

‘అమ్మ’లకు పరీక్ష: పరీక్ష రాసిన 47వేల మంది మహిళలు

Submitted by arun on Mon, 03/26/2018 - 12:14

అమ్మలు బడిబాట పట్టారు..! ఒక్కరు కాదు ఇద్దరు కాదు... 47వేల మంది మహిళలు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లోని పాఠశాలల్లో ఆదివారం ఉదయం పరీక్ష రాస్తున్న మహిళలే కనిపించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పరీక్షలు రాయడమేమిటీ..? ఏం పరీక్షలు అని అనుకుంటున్నారు కదా..? ఇటీవలే బదిలీపై వెళ్లిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగాత్మకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వారి పిల్లలు చదువు నేర్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

ఈ విగ్రహాలను తాకితే గర్బవతులవుతారు

Submitted by lakshman on Tue, 02/06/2018 - 04:24

ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ... ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం. అయితే ఈరోజుల్లో అమ్మతనం పొందాలంటే చాలాకష్టపడాల్సి వస్తుంది. వాతావరణం, ఆహారం, ఒత్తిడి రకరకాల కారణాలతో అమ్మతనానికి దూరం అవుతున్నారు. అందుకోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది.

సీమా భవానీ.. సూపర్ షో..

Submitted by arun on Fri, 01/26/2018 - 14:07

ఢిల్లీ... రాజ్ పథ్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన చేశారు.  సీమా భవానీ వుమన్ బైకర్స్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్డీ పరేడ్‌లో మహిళా మోటర్ సైకిల్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెకాన్‌పూర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించాయి. సీమా భవానీ డ్రైవింగ్ స్కిల్స్ అందర్నీ అబ్బురపరిచాయి. రైడింగ్ స్టంట్స్‌తో థ్రిల్ చేశారు. ప్రెసిడెంట్‌కు సెల్యూట్ చేయడంతో పాటు ఫిష్ రైడింగ్, సైడ్ రైడింగ్ లాంటి స్టంట్లతో సీమా భవానీలు స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచారు.