ministers

వైద్యం చేయించుకున్న కేటీఆర్

Submitted by arun on Fri, 04/06/2018 - 15:47

మేడ్చల్ జిల్లా మల్కాజ్‌‌గిరిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీరెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా దవాఖానలో లక్ష్మారెడ్డి కేటీఆర్‌కు ప్రథమ చికిత్స చేశారు. రాష్ట్రంలో 45కు పైగా వెల్‌నెస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశామని, వాటిలో భాగంగా 17 వెల్‌నెస్‌ సెంటర్‌లు అందుబాటులో ఉన్నాయని మంత్రులు తెలిపారు. వివిధ పథకాలలో భాగంగా డయాగ్నస్టిక్‌ సెంటర్‌లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనంద్‌భాగ్‌లో 29 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌యుబి...ని మంత్రులు ప్రారంభించారు.

ఐదుగురు మంత్రుల‌కు సీఎం కేసీఆర్ చెక్

Submitted by arun on Wed, 01/24/2018 - 11:08

కేబినెట్ విస్తరణకు తెలంగాణ సర్కార్ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందుకు దాదాపు మూహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గం విస్తరణ చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజుల నుంచి ఫామ్‌హౌజ్‌లో సీఎం.. పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.