Republic Day

కలెక్టర్ ఆమ్రపాలి ‘నవ్వుల ప్రసంగం’పై సర్కార్ సీరియస్

Submitted by arun on Mon, 01/29/2018 - 18:32

గణతంత్ర వేడుకల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్పీ సింగ్‌  సీరియస్ అయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూసుకోవడంతో నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్ వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భావోద్వేగం

Submitted by arun on Fri, 01/26/2018 - 13:29

గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌​ భావోద్వేగానికి లోనయ్యారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో  పోరులో అసువులు బాసిన కార్పొరల్‌ జ్యోతి ప్రకాష్‌ నిరాలాకు ప్రకటించిన అశోక్‌ చక్ర అవార్డును అందించిన అనంతరం ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో  అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అమరుడు జ్యోతి ప్రకాష్‌ తరపున ఆయన భార్య సుష్మానంద్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్‌ చక్ర శౌర్య పతకాన్ని అందుకున్నారు.

గణతంత్ర వేడుకలకు హాజరు కాలేకపోయిన సీఎం

Submitted by arun on Fri, 01/26/2018 - 13:19

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించింది. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్‌ ఎగురవేశారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ ప్రభుత్వ గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాలేకపోయారు. కొద్ది రోజులుగా దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సమయానికి అమరావతి చేరుకోలేకపోయారు. విమానం ఆలస్యం కారణంగా సీఎం రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోంది: గవర్నర్‌

Submitted by arun on Fri, 01/26/2018 - 11:44

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్‌ స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోందని కితాబిచ్చారు. జాతీయ సగటు కంటే మిన్నగా 18 శాతం వృద్ధి రేటుతో పరుగులు పెడుతోన్న తెలంగాణ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నదని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. అన్నిటికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. 

ఘనంగా 69వ గణంతంత్ర దినోత్సవ వేడుకలు

Submitted by arun on Fri, 01/26/2018 - 10:59

69వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 ఆసియాన్ దేశాలకు చెందిన అధినేతలు ఆసీనులైన వేళ, రాజ్ పథ్ లో నిర్వహించిన సైనిక పరేడ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనికుల విన్యాసాలతో సాగిన పరేడ్ ను ప్రజలతో పాటు పది దేశాల అధినేతలు కన్నార్పకుండా తిలకించారు. అంతకుముందు పది దేశాల అధినేతలూ ఒక్కొక్కరుగా రాజ్ పథ్ కు వస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఏ హీరో కెరియ‌ర్ లో ఇలా జ‌రిగుండ‌దేమో

Submitted by lakshman on Tue, 01/23/2018 - 21:18

ప్రిన్స్ మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నార‌ని , అందుకు ప్రిన్స్ అభిమానులు సిద్ధంగా ఉండాల‌ని డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ పిలుపునిచ్చారు. డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ - ప్రిన్స్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. సాదార‌ణంగా సినిమా ఫ‌స్ట్ లుక్ అంటే  ఓ ఇమేజ్ ను విడుద‌ల చేస్తారు.