ap

ఇవాళ్టి నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం...నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు

Submitted by arun on Tue, 10/02/2018 - 11:26

తిరుపతిలో ఇవాళ్టి నుంచి  ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానుంది.  ఇప్పటికే ఈ విషయంపై నగరంలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు కోసం నగరపాలక సంస్థ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వాడితే ఫైన్లు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ ను తిరుపతిలో నిషేధించాలని నగరపాలక సంస్థ తీర్మానించింది. గాంధీ జయంతి రోజైనా అక్టోబర్ రెండు నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వినియోగించేవారిపై భారీ జరిమానాలు వేయనున్నారు. 

ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరు ఉధృతం

Submitted by arun on Sat, 07/28/2018 - 10:13

కేంద్రంపై అవిశ్వాసం తర్వాత జరుగుతున్న ధర్మపోరాట దీక్షను సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ఎంపీలంతా ఒంగోలు ధర్మపోరాట సభకు హాజరుకావాలని ఆదేశించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్న ఎంపీలు ప్రజాక్షేత్రంలో వస్తున్న స్పందనను చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అవిశ్వాసం సందర్భంగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో వినిపించిన వాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చంద్రబాబు అన్నారు. 

అసలు పద్మ అవార్డులకు అర్హత ఏంటి..తెలుగు ప్రభుత్వాల సిఫారసులను కేంద్రం ఎందుకు పక్కనపెట్టింది?

Submitted by arun on Sat, 01/27/2018 - 11:12

ప్రతిభావంతులకు కొదువలేదు. కళాకారులకు లెక్కేలేదు. సామాజిక సేవకులూ ఎందరో. కానీ పద్మ అవార్డుల్లో మన తెలుగు రాష్ట్రాలకు దక్కినవెన్నో తెలుసా. ఒకే ఒక్కటి. అందులో తెలంగాణకైతే ఒక్క పురస్కారమూ లభించలేదు. 24 మంది పేర్లను ప్రతిపాదిస్తే, తిరస్కారమే తప్ప పురస్కారానికి పరిశీలించలేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిఫారసులకు చెల్లు చీటి ఇచ్చి, సామాన్యులకు పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న బీజేపీ సర్కారు, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే పురస్కారాలు ఎక్కువిచ్చిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందా...అర్హులే లేరనుకుందా....పక్కనపెట్టేసిందా.

పెద్దాయనకు మద్దెల దరువు

Submitted by arun on Tue, 01/23/2018 - 19:14

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మీద విమర్శలు నానాటికీ పెరుగుతున్నాయి. ఆంధ్రా మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నాడంటున్న ఏపీ బీజేపీ నాయకులు ఏపీకి ప్రత్యేకమైన గవర్నర్ ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు తెలంగాణలో అధికార పక్షానికే పూర్తిగా వంత పాడుతున్నాడంటూ టీ-కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తూండడం విశేషం. 

ఢీ అంటే ఢీ..కేసీఆర్‌ వ్యా‌ఖ్యలకు చంద్రబాబు కౌంటర్

Submitted by arun on Fri, 01/19/2018 - 16:06

చంద్రబాబు, కేసీఆర్ మధ్య మళ్లీ దూరం పెరుగుతుందా?... గతంలో ఇద్దరి మధ్యా జరిగిన మాటల యుద్ధం మరోసారి రిపీట్‌ కాబోతుందా? ఓటుకు నోటు ఎపిసోడ్‌తో ఇద్దరి మధ్యా మొదలైన విభేదాలు మరోసారి తెరపైకి రానున్నాయా? ప్రస్తుతం ఇద్దరి మాటలూ చూస్తుంటే అలానే కనిపిస్తోంది. గతంలో ఒకరినొకరు ఘాటుగా తిట్టుకున్న చంద్రబాబు, కేసీఆర్‌‌లు మరోసారి.... అలాంటి సంకేతాలనేపంపారు. 

విభజన సమస్యల్లో ఒక సమస్య

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:22

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి మూడేళ్లు కావోస్తోంది కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుండిపోయాయి. ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, హైకోర్టు, ఉద్యోగుల విభజన, నీటి పంపకాలతోపాటు విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్స్‌లో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల అప్పగింతపై నేటి వరకు ఇరు రాష్ట్రాలు పట్టించుకున్న పాపాన లేదు. వీటిని పరిష్కరించాలని గవర్నర్ చొరవ చూపినప్పటికీ..రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగినప్పటికీ విషయం మాత్రం నానుతూనే ఉంది.

సంయమనంతో పరిష్కరించుకోవాలి: సీఎం కేసీఆర్

Submitted by lakshman on Fri, 09/15/2017 - 20:01
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రోడ్డు రవాణా సంస్థ ఆస్తుల పంపకాలకు సంబంధించి విజయవాడలో...