cm kcr

డీఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

Submitted by arun on Wed, 09/05/2018 - 09:11

తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందంటున్నారు డీఎస్‌. ఈ మేరకు పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. తాను పార్టీని వదిలితే కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని దయచేసి సస్పెండ్ చేయాలని లేఖ రాశారు.

కేసీఆర్ కు డీఎస్ ఘాటు లేఖ

Submitted by arun on Tue, 09/04/2018 - 13:18

టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌...పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే....పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీని వదిలితే...కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని....దయచేసి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

కొంగర కలాన్‌ చేరుకున్న సీఎం కేసీఆర్

Submitted by arun on Sun, 09/02/2018 - 18:04

ముఖ్యమంత్రి కేసీఆర్‌.... కొంగర కలాన్‌ చేరుకున్నారు. హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్‌... మరికాసేపట్లో సభావేదికపైకి వెళ్లనున్నారు. అయితే అందరి దృష్టి కేసీఆర్‌ ప్రసంగంపైనే ఉంది. ఏం మాట్లాడతోరంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గంటన్నర‌పాటు ప్రసంగించనున్న కేసీఆర్‌‌.... సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రగతి నివేదన సభా వేదిక పైనుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సస్పెన్స్...త్వరలో మరో కేబినెట్ సమావేశం

Submitted by arun on Sun, 09/02/2018 - 16:56

తెలంగాణ కేబినెట్‌ సమావేశం మరోసారి జరగనుంది. ఇవాళ జరిగిన సమావేశంలో చర్చించని అంశాలను ఎల్లుండి జరిగే కేబినెట్‌లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈసారి జరిగే సమావేశంలో ముందస్తుపై చర్చ జరగి అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది. 

రాముడి రూపంలో కేసీఆర్ కటౌట్

Submitted by arun on Sun, 09/02/2018 - 14:13

టీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కటౌట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కటౌట్‌ను శ్రీరాముడి రూపంలో ప్రదర్శించారు. ఈ కటౌట్‌లో కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఫోటోలను ప్రదర్శించి ప్రగతి నివేదన సభకు తరలిరండి అని స్వాగతం పలికారు టీఆర్‌ఎస్ నాయకుడు తేరుపల్లి రమేష్.

ఆయనను సప్పడు చేయకుండా ఎలక్షన్లో నిలబెడదాం : సీఎం కేసీఆర్

Submitted by arun on Sun, 09/02/2018 - 13:36

ముందస్తు వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో  నిన్న విద్యుత్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. కరెంట్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. 35 శాతం పీఆర్సీ ప్రకటించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును ప్రస్తావించారు. ఆ వెంటనే ప్రగతి భవన్‌ ప్రాంగణమంతా విద్యుత్తు ఉద్యోగుల నినాదాలతో మార్మోగింది. దాంతో.. ‘‘ప్రభాకర్‌రావు గారికి గాలి బాగున్నట్లుంది. సప్పడు చేయకుండా ఎలక్షన్లో నిలబెడదాం. ఆయన ఒప్పుకొంటే పార్టీకి లాభమయితది’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దాంతో, ఉద్యోగులంతా ‘ప్రభాకర్‌రావు జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు...భారీగా పెరుగనున్న ఉద్యోగుల జీతాలు

Submitted by arun on Sat, 09/01/2018 - 15:01

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు ఏడాదికి అదనంగా ఐదు రోజుల సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ మేరకు ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అటు విద్యుత్ ఉద్యోగులతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. పీఆర్సీని ప్రకటించనున్నారు. పీఆర్సీ ప్రకటనతో విద్యుత్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 

Tags

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు

Submitted by arun on Sat, 09/01/2018 - 12:51

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్‌‌కు చివర సభ అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.  ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తూ ప్రగతి నివేదన సభకు జనాన్ని తరలిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే దొరల పాలన అంతమవుతుందన్నారు. 

ఎన్ని"కల"ల కోసం

Submitted by arun on Sat, 08/25/2018 - 13:08

విరిసెను కద ముందస్తు విల్లు,

కురిసెను కద ఎన్నో వరాల జల్లు, 

వివిధ వర్గాలకు పుట్టెను ఆశలు ఫుల్లు,
ఎన్ని"కల"ల కోసం వంచుతారు తమ వల్లు.శ్రీ.కో

Tags

కేసీఆర్‌కు సెప్టెంబర్‌ 10 టెన్షన్‌

Submitted by arun on Sat, 08/25/2018 - 12:23

అనధికారిక మంత్రివర్గ సమావేశాలు. హడావుడిగా ఢిల్లీకి కేటీఆర్, రాజీవ్‌ శర్మ, ఇతర న్యాయనిపుణులు. గవర్నర్‌తో కేసీఆర్ భేటి, తాజాగా టీఆర్ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం. వెంటనే ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనం. అన్నీ చకచకా జరుగుండగానే, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ కరెంటు, అర్చకులు, ఇమామ్‌లకు వేతనాలు, నామినేటెడ్ పోస్టులు, ఉద్యోగుల వేతనాలు, కుల సంఘాలకు స్థలాలు వంటి వరాలు, ఐఏఎస్‌ల బదిలీలు. తుపానుకు ముందు ప్రశాంతలా, ముందస్తుకు ముందు సమర సన్నాహాలు. తెలంగాణలో ముందస్తు రణభేరి దాదాపు ఖాయమైంది. మరి ముందస్తుకు అంతా సవ్యమేనా సెప్టెంబర్‌ 10 టెన్షనేంటి కేసీఆర్‌ కాన్ఫిడెన్స్‌ ఏంటి.