Yogi Adityanath

యూనిఫాంలోనే యోగికి పోలీసు అధికారి పూజలు

Submitted by arun on Sat, 07/28/2018 - 12:52

ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు యూనిఫామ్ లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గోరఖ్ పూర్ సర్కిల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ సింగ్.. గురు పూర్ణిమ సందర్భంగా శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు మోకరిల్లారు. అనంతరం యోగికి తిలకం దిద్ది, పూలమాలతో సత్కరించారు. గోరఖ్‌పూర్ ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా ఉన్న యోగి పట్ల పోలీసు అధికారి భక్తిప్రపత్తులు చాటుకున్న ఈ ఘటన శుక్రవారం గురుపౌర్ణమి సందర్భంగా చోటుచేసుకుంది.

యోగీ వర్సెస్ బాబా రాందేవ్‌

Submitted by arun on Wed, 06/06/2018 - 11:33

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ బాబా రాందేవ్‌ను.. బీజేపీ అగ్రనాయకత్వం కలిసి విజ్ఞప్తి చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం యోగా గురుకు ఎదురుదెబ్బ తగిలింది. పతంజలీ సంస్థ సుమారు 6 వేల కోట్లతో గ్రేటర్ నోయిడాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫుడ్ పార్క్‌కు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చే విషయంలో.. జరుగుతున్న తాత్సారంపై రాందేవ్ బాబా.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై అసహనంతో ఉన్నారు. ఎన్నిరోజులైనా విషయం తేల్చకపోవడంతో విసుగుచెందిన రాందేవ్.. చివరకు తన ఫుడ్ పార్క్‌నే తరలించాలని నిర్ణయించారు. ఇటు ఫుడ్‌ పార్క్‌ స్కీమ్‌ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను..

యూపీ సీఎంగా రాజ్‌నాధ్?

Submitted by arun on Sat, 06/02/2018 - 13:32

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు, మెదడువాపు వ్యాధితో మరికొందరు పిల్లలు, పిట్టల్లా రాలిపోయారు. 42 గంటల్లో 42 మంది కన్నుమూశారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 323 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్‌ సిలిండర్ల బకాయిలు  చెల్లించకపోవడంతో, చిన్నారులు ఊపిరందక చనిపోయారు. ఏదో చేస్తాడని భావించిన యోగి ఆదిత్యనాథ్‌‌, పాలన ఇంతేనా అని పిల్లలు పోగొట్టుకున్న తల్లులు రోదించారు.

యోగిని సీఎం పీఠం నుంచి తప్పిస్తారా?

Submitted by arun on Tue, 04/10/2018 - 12:00

యూపీ జంగిల్‌ రాజ్‌కు పాతరేసి, రామరాజ్యానికి పునరుద్దిస్తానన్నాడు. కానీ అరాచక రాజ్యం సాగుతోంది. యూపీ రూపురేఖలు మారుస్తానన్నాడు. కులంమతం గొడవలతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతోంది. గోరఖ్‌పూర్‌ను ఏలినట్టే, రాష్ట్రాన్ని పాలిస్తాడని ఆశించారు. కానీ అవన్నీ అడియాశలేనని, పిల్లల మరణమృదంగం సాక్షిగా అర్థమైంది. వివక్షపై దళిత ఎంపీలు తిరగబడుతున్నారు. అగ్రకులాలకేనా ప్రాధాన్యత, కనీస మర్యాద ఇవ్వరా అని, భాగస్వామ్య పార్టీలు కన్నెర్రజేస్తున్నాయి. యూపీ బైపోల్ సాక్షిగా, బీజేపీకి బీపీ పెరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్‌, పాలనపై ఒక్క ఏడాదిలో ఎందుకింత వ్యతిరేకత పెరుగుతోంది?

ఉపఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన బీజేపీ

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:25

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59,460 ఓట్ల భారీ తేడాతో విజయభేరి మోగించారు. బీజేపీ  ఘోర పరాభవాన్ని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అంగీకరించారు.

న్యాయం చేయాలని రక్తంతో ప్రధానికి లేఖ రాసిన అత్యాచార బాధితురాలు

Submitted by arun on Tue, 01/23/2018 - 17:02

త‌నకు జ‌రిగిన అన్యాయానికి స‌రైన న్యాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల‌కు ఓ అత్యాచార బాధితురాలు ర‌క్తంతో లేఖ రాసి పంపింది. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన వారికి శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె లేఖ‌లో వేడుకుంది. `ఫిర్యాదు చేసినప్ప‌టికీ పోలీసులు ఎలాంటి చ‌ర్య తీసుకోవ‌డం లేదు. నిందితుల‌కు పెద్ద పెద్ద వ్య‌క్తుల‌తో సంబంధాలు ఉండ‌టం వ‌ల్ల వారు మా బాధ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాకుండా కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు` అని ఆ బాధితురాలు లేఖ‌లో పేర్కొంది.