cm kcr

టీఆర్ఎస్ లోనూ రెడ్లదే ఆధిపత్యం

Submitted by arun on Thu, 11/15/2018 - 11:53

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాలకు పోటీ పడే అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి, రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రకటించిన సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24 సీట్లు దక్కగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, సిక్కులకు ఒకటి దక్కాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకు 2 విడతలుగా 117 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్ధులను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, రెడ్లకు 37, వెలమలకు 12, మున్నూరు కాపులకు 8, గౌడలకు 6, యాదవులకు 5 సీట్లు లభించాయి.

Tags

ఇవాళ మంచి ముహూర్తాలు...కేసీఆర్ సహా పలువురి నామినేషన్లు...

Submitted by arun on Wed, 11/14/2018 - 10:23

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం సమయంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తే మరోసారి రాజయోగం వస్తుందని పండితుల సూచించారు దీంతో ముహూర్త బలాన్ని ఎక్కువగా నమ్మే కేసీఆర్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇవాళ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నామినేష్లు వేయనున్నారు. 

చినజీయర్‌ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

Submitted by chandram on Sat, 11/10/2018 - 17:15

శంషాబాద్ లోని దివ్యసాకేతాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం సందర్శంచి ప్రత్యేకపూజలు పార్థనలు జరిపించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కెసిఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. ఎప్పటిలాగే ఎన్నికలకు ముందు స్వామి చినజీయర్ స్వామి ఆశ్సీసులు తీసుకోవడం కెసిఆర్ కు అలావాటే. ముందస్తు ఎన్నికలకు ఆశ్రమాన్ని దర్శించి స్వామివారి ఆశ్సీసులు పొందారు.
 

కెసిఆర్ పై గద్దర్ పోటీ...

Submitted by arun on Thu, 11/08/2018 - 14:42

ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ స్ఫష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి మద్దతు దారుడిని కాదని, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వారితో జరిగిన సమావేశంలో 45 నిమిషాలూ పాట పాడి వినిపించానని, అంతే కాకుండా రాహుల్‌కు ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ సేవ్‌ డెమొక్రసీ’ గురించి వివరించానని అన్నారు. ఢిల్లీలో సీఐడీ అడిషినల్‌ డీజీని కలిసి తనకు రక్షణ  కల్పించాలని కోరానని, సీఈఓకు కూడా వినతిపత్రం సమర్పించానని వెల్లడించారు.

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోంది

Submitted by arun on Sat, 10/27/2018 - 12:52

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోందన్నారు టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌ రేవంత్ రెడ్డి. క్రీడలు జరిగే గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ జరిగే సెన్సేషన్ రైజ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవెంట్ పేరుతో లిక్కర్ సరఫరా జరుగబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారా అని రేవంత్ ధ్వజమెత్తారు. ఈవెంట్ పై ఎన్నికల అధికారి రజత్ కుమార్ విచారణకు ఆదేశించాలని కోరారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయలేదు.. కానీ స్టేడియంలో మాత్రం తాగుబోతుల ఈవెంట్ కు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

Submitted by arun on Wed, 10/03/2018 - 18:16

పేదల పింఛన్ లను మళ్లీ పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న 200రూపాయిల పింఛన్ ను వెయ్యికి పెంచిన ఘనత తమదేనన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం.. గత ప్రభుత్వాల హయాంలో ముసలివాళ్లను, వికలాంగులను చూసేవాల్లు లేరు. బీడీ కార్మికులను ఆదుకునే వారు లేరు. రూ. 42 వేల కోట్ల ఖర్చు పెట్టి.. 200 ఉన్న పెన్షన్‌ను వెయ్యికి తీసుకుపోయాము. కాంగ్రెస్ అరాజ్ పాడినట్టు నువ్వు 1000 ఇస్తావా.. మేము 2000 ఇస్తాం. నేను 2200 ఇస్తామంటే మీరేం చేస్తారు.

అడుక్కుంటే నేనే నాలుగు సీట్లు ఇస్తాను : కేసీఆర్

Submitted by arun on Wed, 10/03/2018 - 18:06

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసినవారితోనే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రవాళ్లకు అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడికి పదును పెట్టి ఎన్నికల ప్రచారంలో హీట్ రాజేశారు. తెలంగాణను నాశనం చేసినవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా తనను అడిగితే, నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మోద్దన్నారు కేసీఆర్.

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

Submitted by arun on Sat, 09/29/2018 - 15:00

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన .. కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను .. విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు.

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా...లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా: రేవంత్

Submitted by arun on Thu, 09/27/2018 - 16:00

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా.. లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా.. మీ మీద నమ్మకంతోనే కోస్గీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అంటూ కార్యకర్తలకు చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకుని హైదరాబాద్ బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ .. తొడగొట్టి చెబుతున్నా జైల్లో నుంచి ప్రచారం చేసుకున్నా 50వేల మెజార్టీతో కొడంగల్‌లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. 

వచ్చే నెల 3 నుంచి రంగంలోకి కేసీఆర్‌...ప్రచార షెడ్యూల్‌ విడుదల...

Submitted by arun on Wed, 09/26/2018 - 10:29

కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ ఖరారైంది. పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన కేసీఆర్‌ బహిరంగ సభల షెడ్యూల్‌ను ఫైనలైజ్‌ చేశారు. అక్టోబర్ 3నుంచి 8వరకు ఉమ్మడి జిల్లాల వారీగా తొలి దశ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కేసీఆర్‌ మళ్లీ దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.