Anna Lezhneva

చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్ దంపతులు

Submitted by arun on Wed, 08/22/2018 - 15:46

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 63వ పుట్టిన రోజు వేడుకలను నేడు జరుపుకుంటున్నారు, తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి టాలీవుడ్ సినీ రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి చిరంజీవిని కలిశారు. చిరంజీవికి పవన్‌కల్యాణ్, అన్నాలెజినోవా దంపతులు పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ భార్య లెజ్నోవా

Submitted by arun on Tue, 01/23/2018 - 11:51

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు టూర్‌‌కు ముందు భార్య లెజ్నోవా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యాలో పుట్టినప్పటికీ తెలుగు సాంప్రదాయాలకు గౌరవమిస్తున్నారు. క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియకపోయినా పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఆచరిస్తున్నారు.