PM Narendra Modi

కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Submitted by arun on Wed, 11/07/2018 - 11:40

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. దీపావళిని పురస్కరంచుకుని మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మోడీ కొద్దిసేపు అక్కడి భక్తులతో ముచ్చటించారు. కేదార్ నాథ్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు. అలాగే కేదార్‌పురి పునర్నిర్మాణ పనులను సీమీక్షించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి. కేదార్ నాథ్ ఆలయ సందర్శన తర్వాత మోడీ పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో కలసి దీపావళి వేడుకలు జరుపుకుంటారు.

బీజేపీని వణికిస్తున్న కొత్త భవనం...బీజేపీకి టీడీపీ దూరం కావడానికి...

Submitted by arun on Mon, 10/22/2018 - 11:45

కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమేంటి..? కర్ణాటకలో కమలనాథుల పరాజయానికి కారణమేంటి..? బీజేపీకి టీడీపీ దూరం కావడానికి..జమ్ములో పీడీపీతో సంకీర్ణం విచ్ఛిన్నం కావడానికి కారణమెవరు..? శివసేన - బీజేపీ శత్రువులు అవ్వడం వెనుకున్న రీజన్ ఏంటి..? కమలదళం మదిలో మెదులుతున్న సెంటిమెంట్ వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే..! 
 

స్టాలిన్‌ను ఓదార్చిన ప్రధాని మోదీ

Submitted by arun on Wed, 08/08/2018 - 12:19

కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. చెన్నై చేరుకున్న ప్రధాని మోడీ రాజాజీ హాల్‌కు వెళ్లి, అక్కడ కరుణ పార్థివదేహాన్ని దర్శించి, అంజలి ఘటించారు. కరుణానిధి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. స్టాలిన్, కనిమొళిని ప్రధాని ఓదార్చారు. కరుణానిధి పార్థివదేహానికి ప్రధానితో పాటు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నివాళులర్పించారు.

లోక్‌సభలో రాహుల్ కితకిత

Submitted by arun on Fri, 07/20/2018 - 14:41

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన రాహుల్.. తన ప్రసంగం ముగిసిన తర్వాత .. మోదీ వద్దకు వెళ్లి ఆయనకు విషెస్ చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత మోదీని హగ్ చేసుకున్నారు. రాహుల్ స్టంట్ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. 

మోడీ ముందస్తు సంకేతాలు...నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలు?

Submitted by arun on Tue, 06/26/2018 - 12:28

ఒకవైపు సంఘ్‌ నుంచి ఒత్తిళ్లు... మరోవైపు పార్టీలో పెరుగుతోన్న వ్యతిరేక వర్గం.... ఇంకోవైపు బలం పుంజుకుంటోన్న ప్రత్యర్ధులు.... వీటన్నంటికీ ముందస్తు ఎన్నికలే విరుగుడుగా భావిస్తోంది మోడీ-షా ద్వయం. మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి సత్తా నిరూపించుకుంటే ఇక తిరుగుండదని భావిస్తోన్న మోడీ, అమిత్‌షాలు.... ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ మొదలుపెట్టిన మోడీ-షాలు.... నవంబర్‌, డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ ఎదుట కుండ బద్ధలు కొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 06/18/2018 - 10:18

దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్‌ వేదిక అవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్ విధాన నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌కు ఆదేశించారు. 115 జిల్లాల్లో 45వేల గ్రామాలకు ఏడు కీలక పథకాలను 2018 ఆగస్టు 15 కల్లా చేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, ఈ సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగంతో వేడెక్కింది. ఆయన తనకిచ్చిన సమయం మించి మరీ  ప్రధాని మోడీ ఎదుట..తాను చెప్పాల్సింది చెప్పేశారు. 

మోడీ నాలుగేళ్ల పాలనపై రాహుల్‌ ట్విట్

Submitted by arun on Sat, 05/26/2018 - 13:41

నాలుగేళ్ల మోడీ పాలనపై రాహుల్  సెటైరికల్‌గా ట్విట్ చేశారు. నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు పేరుతో.. గ్రేడింగ్స్ ఇచ్చారు. వ్యవసాయం, విదేశాంగ విధానం, పెట్రో ధరలు, ఉద్యోగ కల్పన విషయంలో మోడీ సర్కారు విఫలమైందని.. ట్విట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ అనుకూల నినాదాలను పుట్టించడంలో, తమ గురించి తాము చెప్పుకోవడంలో.. దూసుకుపోయారంటూ A ప్లస్ గ్రేడ్ ఇచ్చారు. ఇక యోగా విషయంలో మాత్రం B నెగటీవ్ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు

వ్యవసాయం : ఎఫ్

విదేశాంగ విధానం : ఎఫ్

ఇంధన ధరలు : ఎఫ్

ఉద్యోగాల కల్పన : ఎఫ్

నినాదాలు సంధించడం : ఎ 

ఢిల్లీ టూర్‌ను మధ్యలోనే ముగించిన గవర్నర్ నరసింహన్

Submitted by arun on Wed, 04/25/2018 - 11:14

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన ఢిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించారు. నిన్న సాయంత్రం ప్రధాని సహా.. కేంద్రంలోని ప్రముఖులను కలిసేందుకు నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. ఐతే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. గవర్నర్ 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేస్తారనుకున్నా ఇంతలోనే ఆయన ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యారు.
ఇవాళ ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించాల్సి ఉన్నా.. గవర్నర్ మధ్యలోనే తన పర్యటనను ముగించుకొని రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

బీజేపీకి యశ్వంత్‌ సిన్హా గుడ్‌బై

Submitted by arun on Sat, 04/21/2018 - 14:19

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా  ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

మోడీకి భార్య - పిల్ల‌లుంటే ఇలా చేయ‌రు క‌దా

Submitted by lakshman on Sun, 04/08/2018 - 16:01

ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైచేయి కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదివారం ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, మరోవైపు టీడీపీ ఎంపీల ఆందోళన.. ఇలా డిల్లీలో ఇరు పార్టీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.