tamilnadu

దూసుకొస్తున్న ‘గజ’ తమిళనాడులో హైఅలర్ట్

Submitted by chandram on Wed, 11/14/2018 - 19:05

గజ తుపాను తమిళనాడును హడలెత్తిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను చెన్నకి తూర్పున 530 కిలోమీటర్లు నాగపట్నానికి ఈశాన్యంగా 620 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోనూ, 15న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కొన్నిచోట్ల మోస్తరుగానూ, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ గొంతుకోసిన యువకుడు

Submitted by arun on Sat, 11/03/2018 - 15:54

పెళ్లిచేసుకునేందుకు యువతి నిరాకరించడంతో ఓప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆమెను చిత్రహింసలకుగురిచేసి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడు.ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో
చోటుచేసుకుంది.తంజావూర్ జిల్లా పాపనాశం శివాలయం వద్ద వసంతప్రియ(25) నివాసం. కుంభకోణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వసంత ప్రియను తనకు ఇచ్చి
వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులను, సమీప బంధువు నందకుమార్ అడిగాడు. కాగా దీనికి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. వెంటనే మరో యువకుడితో వచ్చే ఏడాది

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి, 30 మందికి గాయాలు

Submitted by arun on Sat, 09/01/2018 - 10:03

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణీకులను గ్యాస్ కటర్‌ల సాయంతో బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. 
 

షాకింగ్ ఘటన..యూట్యూబ్‌లో చూసి.. ప్రాణాల మీదకు..

Submitted by arun on Thu, 07/26/2018 - 13:43

యూట్యూబ్ లో ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ, ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భార్య ప్రాణాలను బలిగొంది. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక(28) ఆమె ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కృతిక భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

తమిళనాడు జల్లికట్టు పోటీల్లో చిందిన రక్తం

Submitted by arun on Mon, 01/15/2018 - 17:25

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో రక్తం చిందింది. మధురైలో నిర్వహించిన జకట్టు పోటీల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. పొగరు మీదున్న ఎద్దులను నియంత్రించేందుకు యువత పోటీపడ్డారు. నువ్వానేనా అంటూ వందలాది మంది యువకులు.... ఎద్దులతో కుస్తీపడ్డారు. పొగరుతో దూసుకొస్తున్న ఎద్దులను తమ బలంతో పడగొట్టేందుకు తొడగొట్టారు. కానీ ఎద్దుల పొగరు ముందు యువకులు నిలబడలేకపోయారు. బుల్స్‌ అన్నీ బుల్‌డోజర్లలాగా దూసుకుపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారంతా మధురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేటీఆర్ మెచ్చిన రియ‌ల్ బాహుబ‌లి

Submitted by arun on Sun, 12/31/2017 - 14:04

రియ‌ల్ బాహుబ‌లిపై మంత్రి కేటీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. అత‌నే నిజ‌మైన బాహుబ‌లి అంటూ కేటీఆర్ ఓ ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా పోస్ట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. త‌మిళ‌నాడులో ఫారెస్ట్ గార్డుగా ప‌నిచేస్తున్న శ‌ర‌త్ కుమార్ హీరోయి అయిపోయాడు. విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఓ ఏనుగు అడ‌విలోనుంచి జ‌నార‌ణ్యంలోకి వ‌చ్చింది. అయితే ఆ ఏనుగును అడ‌విలోకి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా పెద్ద గుంత‌లో ప‌డిఉన్న ఏనుగుపిల్ల క‌నిపించింది. స‌మాచారం అందుకున్న శ‌ర‌త్ కుమార్ ఆ ఏనుగుపిల్ల‌ను సుర‌క్షితంగా భ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Submitted by arun on Mon, 12/25/2017 - 10:16

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా అచ్చిరపాకం దగ్గర కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది. చనిపోయిన వారిలో ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులో బీజేపీ రికార్డు: సుబ్రహ్మణ్య స్వామి

Submitted by arun on Sun, 12/24/2017 - 13:57

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడాన్ని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. తమిళనాడులో బీజేపీ రికార్డు సాధించిందని ఎద్దేవా చేస్తూ, ఓ జాతీయ పార్టీగా ఉండి, కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ అభ్యర్థికి, నోటాకు పడ్డ ఓట్లలో పావు వంతు కూడా రాలేదని చెప్పారు. ఉప ఎన్నికలో దినకరన్‌ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 

శివవైష్ణవులు ఒకేచోట కొలువైన ఆలయం..చిదంబరం

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:44

తమిళనాడులోనిది చిదంబరం. తమిళ‌నాడు అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. అందులోనూ చిదంబర ఆలయానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. తమిళ‌నాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నైకు దక్షిణంగా 250 కి. మి. దూరంలో కలదు. శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళ నాడులోని చిదంబరం. తమిళనాడులో శివాలయాలకు కొదువ లేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

అనితా ఓ అనితా

Submitted by lakshman on Sat, 09/16/2017 - 20:14
చిన్నప్పటినుంచీ ఆమెకున్న ఒకే ఒక స్వప్నం... డాక్టర్ అవ్వాలని. ఇందుకోసం పాపం రేయింబవళ్లు కష్టపడి చదివింది, మంచి మార్కులు సాధించింది, కానీ ఇంతలోనే ‘నీట్’ అనే రాకాసిబల్లి బారిన పడి.. ప్రాణాలు కాపాడాల్సిన...