bus yatra

ఉత్తమ్‌ బస్సు యాత్రకు బ్రేక్‌?

Submitted by arun on Wed, 06/20/2018 - 07:16

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకూ గడ్డం గీసుకోనంటూ ప్రతినబూని.... పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు... సీనియర్లు చెక్‌ పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. మూడు విడతల్లో 38 నియోజకవర్గాలను చుట్టేసిన ఉత్తమ్‌ను... నాలుగో విడత యాత్ర చేపట్టొద్దని అధిష్టానం ఆదేశించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఉత్తమ్‌ ఢిల్లీ టూర్ తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

టీడీపీ సరికొత్త వ్యూహం

Submitted by arun on Mon, 04/09/2018 - 17:14

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం టీడీపీ అధికార ప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. 2,3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీల బస్సు యాత్ర కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హోదాపోరులో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో సమావేశం కావాలని.. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

విభేదాల యాత్ర

Submitted by arun on Mon, 04/09/2018 - 12:27

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్ర సాఫీగానే సాగుతోందా..? బడా నేతలంతా హాజరవుతున్నారా..? డుమ్మా కొడుతున్నారా..? జిల్లా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు యాత్రపై ఎఫెక్ట్ చూపిస్తోందా..? 

బస్సుతో కారుకు చెక్?

Submitted by arun on Thu, 03/29/2018 - 11:12

మూడు వారాల బ్రేక్ తర్వాత మలివిడత ప్రజా చైతన్య బస్సుయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లి  ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హస్తం పార్టీ భావిస్తోంది. రెండోవిడత ప్రజా చైతన్య బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగే మలి విడత బస్సు యాత్ర  ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది.

తొలివిడత బస్సుయాత్రతో జోష్ పెరిగిన టీ-కాంగ్రెస్

Submitted by arun on Sat, 03/10/2018 - 11:38

టీ-కాంగ్రెస్ నేతల తొలివిడత బస్సుయాత్ర ముగిసింది. సొంత పార్టీ బలాలు అధికార పార్టీ బలహీనతలు నేర్చుకోవాల్సిన పాఠాలు క్షేత్రస్థాయిలో ప్రజానాడి ఇలాంటి అనేక అంశాలపై కొంతమేర అవగాహన కలిగిందంటున్నారు.. టీ-కాంగ్రెస్ నేతలు. మలి విడత చేపట్టబోయే యాత్రకు అవసరమైన ప్రచార సామగ్రిని ఈ యాత్ర అందించిందని వారంటున్నారు. 

తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టే లక్ష్యంతో 8 రోజుల పాటు సాగిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఫిబ్రవరి 26న చేవెళ్లలో ప్రారంభమైన బస్సుయాత్ర మార్చి 8న ముగిసింది. హోలీ కారణంగా మధ్యలో రోజులు మినహాయిస్తే 11 రోజుల షెడ్యూల్ లో 8 రోజుల యాత్ర దిగ్విజయంగా సాగింది. 

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది

Submitted by arun on Fri, 03/02/2018 - 15:27

కాంగ్రెస్ లో పునరుత్తేజం కనిపిస్తోందా? అందరూ కలిస్తే తప్ప అధికార పార్టీని ఎదుర్కోలేమన్న మానసిక స్థితి నుంచి ఒంటరిగానైనా ఎదిరిస్తామని చెప్పగలిగిన స్థితి ఎక్కడ నుంచి వచ్చింది? టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకోసం అనుసరిస్తున్న విధానాలేంటి? తాను సక్సెస్ ఫుల్ నేతగా అనిపించుకునేందుకు ఆయన ఏం చేస్తున్నారు? 

బ‌స్సు యాత్ర వాయిదా..?

Submitted by arun on Sun, 02/18/2018 - 16:27

ప్రధాన ప్రతిపక్షంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఉత్తమ్ కుమార్ అధిష్టానాన్ని ఒప్పించి బస్సుయాత్రకు తేదీలు ఖరారు చేసుకుంటే.. సీనియర్లంతా మూకుమ్మడిగా విభేదించి, ఖరారైన తేదీలు మళ్లీ వాయిదా పడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరితో చర్చించకుండా బస్సుయాత్ర ఎలా చేస్తారని పార్టీ సీనియర్లంతా వ్యతిరేకించడంతో ఆ యాత్ర తేదీలు మరోసారి అయోమయంలో పడ్డాయి. 

65 స్థానాల్లో ఓకే

Submitted by arun on Tue, 01/23/2018 - 10:57

డిసెంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికే  ఎన్నికల కసరత్తు ప్రారంభించినట్టు ఉత్తమ్ తెలిపారు. 60–65 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.