vijayashanthi

రాములమ్మ ఎక్కడ?

Submitted by arun on Tue, 09/11/2018 - 09:27

తెలంగాణలో ముందస్తు కాక రేగుతున్న తరుణంలో, రాములమ్మ సందడి మాత్రం కనిపించడం లేదు....ఎందుకు...విజయశాంతి అలిగారా....సినిమా స్క్రీన్‌పై లేడీ అమితాబ్‌ చెలరేగి, పొలిటికల్‌ స్క్రీన్‌పై సంచలనంగా ఎదిగిన, రాములమ్మ ఇప్పుడెక్కనున్నారు ముందస్తు వేడితో తెలంగాణ రగులుతుంటే విజయశాంతి యాక్టివ్‌గా లేకపోవడమేంటి రాములమ్మను అధిష్టానం పట్టించుకోవడం లేదా లేదంటే ఆమెనే అలిగారా? ఇంతకీ రాముల్మ ఎక్కడ?

విజ‌య శాంతిపై హ‌త్యాయ‌త్నం చేసింది ఎవ‌రంటే

Submitted by lakshman on Thu, 01/25/2018 - 23:44

చాలా కాలం త‌రువాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా పార్టీ కార్య‌క‌ల‌పాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి..రాహుల్ గాంధీతో భేటీ అనంత‌రం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఉద్య‌మ‌స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన స‌వాళ్లు,  తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారో, 
 జయలలిత కు మ‌ద్ద‌తు త‌న‌ని ఎవ‌రు చంపాల‌నుకున్నారో అన్నీ త‌న‌కు తెలుసంటూ ఆ నాటి ప‌రిస్థితుల్ని వివ‌రించారు. 

జయశంకర్ సార్ చెప్పడం వల్లే అలా చేశా..

Submitted by arun on Thu, 01/25/2018 - 18:05

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను తిట్టిన పవన్‌ ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చెప్పుకుంటున్నట్టుగా రాష్ట్రం బంగారు తెలంగాణగా లేదని, ఇత్తడి తెలంగాణగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో గవర్నర్ చెప్పడం కాదు..ప్రజలను అడిగితే చెబుతారన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేసిన రాముల‌మ్మ

Submitted by lakshman on Tue, 01/23/2018 - 00:39

తెలంగాణ‌లో జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న పై అధికార ప్ర‌భుత్వం ఎలా ఉన్నా.. ప్రతిప‌క్ష‌నేత‌లు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌పై మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ  పవన్ క‌ల్యాణ్ కు .. సీఎం కేసీఆర్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పొందాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఇక కొండ‌గ‌ట్టు సంద‌ర్శించిన ప‌వ‌న్ భ‌క్తితో చేస్తే ప‌ర్వాలేదు. రాజ‌కీయం మాత్రం చేయోద్ద‌ని సూచించారు. అంతేకాదు తెలంగాణ ఉద్య‌మ‌సమ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాణ‌లు చెప్పాల‌ని లేదంటే తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వం అని హెచ్చ‌రించారు.