National Flag

చంద్రబాబు కళ్లముందే జాతీయజెండాకు అవమానం!

Submitted by arun on Sat, 01/27/2018 - 13:18

విజయవాడ నగరంలో శనివారం నిర్వహించిన ఆలిండియా సివిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం చోటుచేసుకుంది. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల క్రికెట్ టోర్నమెంట్ అమరావతి సమీపంలోని మూలపాడులో ప్రారంభమయింది. ఈ టోర్నీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 34 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. అయితే, తాడు బిగుసుకుపోవడంతో, జాతీయ జెండా ఎగరలేదు.

పవన్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం

Submitted by arun on Mon, 01/22/2018 - 17:02

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కొండగట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో పూజలు చేసిన పవన్.. బయటకు వస్తున్న క్రమంలో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు. ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. అత్యుత్సాహంతో అభిమానులు.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. దీంతో పవన్ బౌన్సర్లు.. జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 2 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు.