Dance

జ్వరం డాన్స్.. జ్వరం డాన్స్..చేసిన బన్ని& ఎన్టీఆర్.

Submitted by arun on Tue, 08/14/2018 - 16:28

ఏమండి.. ఇది విన్నారా..? ఆర్య 2 లో "మై లవ్ లవ్ గాన్" పాట చేసేప్పుడు అల్లు అర్జున్ కి ,  అలాగే "మీ నాన్న టెంపెర్" పాట చేసేప్పుడు ఎన్టీఆర్ కి బాగా ఎక్కువ జ్వరం కలిగి ఉన్నారట. అయినప్పటికీ, వారు ఇద్దరు డాన్స్లో ఎక్కడ ఆ ఛాయలు కనబడకుండా చాల బాగా చేసారు, పాపం ప్రేక్షకులకు ఆనందం కోసం హీరోలు బాగానే కష్టపడతారు. శ్రీ.కో
 

వెరైటీ దొంగ...డాన్య్ చేస్తూ...

Submitted by arun on Thu, 07/12/2018 - 16:58

ఒకప్పుడు దొంగతనం అంటే దొంగలకు అదో పెద్ద టాస్క్. ఏదైనా కొట్టేయాలంటే ప్లాన్ చేసి పని పూర్తి చేసే దాకా విపరీతమైన టెన్షన్. ఎక్కడ దొరికిపోతామేమోనని భయం. వెళ్లిన చోట ఏదైనా విలువైన వస్తువులు దొరికితే బావుండనే ఆశ. ఇలా చాలా  విషయాల్లో టెన్షన్ పడి అటెన్షన్ పాడవకుండా గుట్టు చప్పుడు లేకుండా పని పూర్తి చేసేవారు. ఇదంతా ఒక తరం దొంగల స్టైల్. ఇప్పుడు దొంగలు మారారు. దొంగతనం చేసే విధానం మారింది. 

కత్రినా కైఫ్ కు సున్నా మార్కులేశారట

Submitted by arun on Sat, 03/17/2018 - 11:42

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఊపు తీసుకురావడంలో.. కత్రినా కైఫ్ చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి. చిక్ నీ చమేలీ.. షీలా కీ జవానీ లాంటి సాంగ్స్ ఇప్పటికీ టాప్ హిట్స్ గా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ ను అలా వినగానే.. ఇలా ఊపేస్తున్నాయి. తన డ్యాన్సింగ్ టాలెంట్ తో అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ కు.. ఓ కొరియోగ్రఫర్.. డ్యాన్స్ లో సున్నా మార్కులేశాడట.

ఆ యువ‌తి ఫుల్‌గా తాగి మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా

Submitted by arun on Mon, 02/05/2018 - 16:38

ఓ యువతి ఫుల్‌గా తాగింది. మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా డ్యాన్స్ చేసింది. ఈ వ్యవహారం గుర్గావ్‌లో వెలుగు చూసింది. ప్రేమించిన అబ్బాయి మోసం చేయడంతో అందుకు ప్రతీకారం కోసం ప్రియుడి ఇంటి ముందు ఇలా డ్యాన్స్ చేసింది. ఏకంగా డీజేతో  ప్రియుడి ఇంటి ముందు చిందేసింది. అంతేకాదు ఆమిర్‌ఖాన్‌ ఫేమస్‌ మూవీ రాజా హిందూస్తాన్‌ లోని నాలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ తన బాధను తెలియజేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఆమె మనసు ఎంత గాయపడి ఉంటే అలా చేసి ఉంటుందని మద్దతు పలుకుతున్నారు.
 

పిస్తోల్ పట్టుకుని చిందేసిన సబ్ ఇన్‌స్పెక్టర్..భయాందోళన చెందిన వీక్షకులు

Submitted by arun on Mon, 01/22/2018 - 16:53

యూపీ రాజధాని లక్నోలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ చిందేశాడు. చేతిలో పిస్తోల్ పట్టుకుని పాటలు పాడాడు. తేజాస్ వెల్ఫేర్  సోసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హిందీ సినీ పాటలకు పులకించిపోయి సబ్ ఇన్ స్పెక్టర్ వేదికపైకి వచ్చాడు. ఓ చేతిలో పిస్తోల్ పట్టుకుని కళకారులతో కలిసి ఆడిపాడాడు. అయితే, ఎక్కడ సబ్ ఇన్ స్పెక్టర్ పిస్తోల్ ను పేలుస్తాడేమోనని కార్యక్రమ నిర్వహకులు, వీక్షకులు భయాందోళన చెందారు.