Lucknow

హింసాత్మకంగా మారిన యూత్ కాంగ్రెస్ ర్యాలీ

Submitted by arun on Tue, 06/26/2018 - 16:47

లక్నోలో యూత్ కాంగ్రెస్ చేపట్టిన సేవ్ ఇండియా కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లక్నో పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఉత్తర ప్రదేశ్‌లో అనేక అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా నిరసించారు. బిజెపికి చెందిన మహిళా మంత్రులు కూడా అత్యాచారాల అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పాస్‌పోర్టు కావాలా.. మతం మార్చుకొని రా!

Submitted by arun on Fri, 06/22/2018 - 11:17

లక్నో పాస్‌పోర్ట్ కార్యాలయంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కలగజేసుకోవడంతో కథ సుఖాంతం అయింది. దురుసుగా ప్రవర్తించిన పాస్‌పోర్ట్ అధికారిపై బదిలీ వేటు పడింది. 

కేంద్రానికి ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే

Submitted by lakshman on Wed, 03/28/2018 - 16:57

బీజేపీ ఎంపీ తిరుగుబాటు చేశారు. ఎస్సీ ఎస్టీల కు రిజ‌ర్వేష‌న్ల‌ను ఎత్తివేయ‌డానికి కుట్ర జ‌రుగుతోందంటూ ఆందోళ వ్య‌క్తం చేశారు. సొంత పార్టీ తీరుపై విమ‌ర్శ‌లు చేస్తూ ఏప్రిల్ 1న ల‌క్నోలో భారీ ర్యాలీ చేప‌డుతున్న‌ట్లు హెచ్చ‌రించారు. 

భర్తపై దాడి.. తుపాకీతో వచ్చి కాపాడిన భార్య

Submitted by arun on Mon, 02/05/2018 - 18:17

ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందు నిల‌బ‌డి ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా దూసుకొచ్చి ఆయ‌న‌పై పిడిగుద్దులు కురిపిస్తూ, రాడ్‌తో కొడుతూ దాడి చేశారు. తన భర్తపై కర్రలతో దాడికి చేస్తున్నార‌ని తెలుసుకున్న మ‌హిళ‌ తుపాకీతో బయటకు వచ్చి స‌ద‌రు దుండ‌గుల‌ను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళితే..లఖ్‌నవూలోని కాకోరీ ప్రాంతానికి చెందిన అబిద్ అలీ వృత్తిపరంగా జర్నలిస్టు. సోమవారం ఉదయం అలీ తన ఇంటి ముందు నిల్చుని మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అలీపై దాడి చేయడం ప్రారంభించారు.

పిస్తోల్ పట్టుకుని చిందేసిన సబ్ ఇన్‌స్పెక్టర్..భయాందోళన చెందిన వీక్షకులు

Submitted by arun on Mon, 01/22/2018 - 16:53

యూపీ రాజధాని లక్నోలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ చిందేశాడు. చేతిలో పిస్తోల్ పట్టుకుని పాటలు పాడాడు. తేజాస్ వెల్ఫేర్  సోసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హిందీ సినీ పాటలకు పులకించిపోయి సబ్ ఇన్ స్పెక్టర్ వేదికపైకి వచ్చాడు. ఓ చేతిలో పిస్తోల్ పట్టుకుని కళకారులతో కలిసి ఆడిపాడాడు. అయితే, ఎక్కడ సబ్ ఇన్ స్పెక్టర్ పిస్తోల్ ను పేలుస్తాడేమోనని కార్యక్రమ నిర్వహకులు, వీక్షకులు భయాందోళన చెందారు.