padmavat

దుండ‌గుడి కాల‌ర్ ప‌ట్టుకొని చెంప ప‌గ‌ల‌గొట్టిన దీపికా

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:00

పద్మావత్ సినిమా వివాదం పై హీరోయిన్ దీపికా పదుకొని త‌న‌దైన స్టైల్లో రిప్ల‌యి ఇచ్చింది.  డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన క‌ర్ణిసేనను కించ‌ప‌రిచేలా ప‌ద్మావ‌త్ ఉందంటూ ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఆందోళన చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సినిమా విడుద‌ల కాకుండా ప్ర‌య‌త్నాలు చేశారు. అంతేకాదు సినిమాలో ప‌ద్మావ‌త్ గా యాక్ట్ చేసిన  దీపిక ముక్కు కోసి తెచ్చిన వారికి ఐదు ల‌క్ష‌ల్ని బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. క‌ర్ణిసేన‌కు మ‌ద్ద‌త‌కు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

వెల్ కం టూ పాకిస్థాన్

Submitted by lakshman on Fri, 01/26/2018 - 22:17

పద్మావత్ సినిమా వివాదం తారాస్థాయికి చేరింది. డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన క‌ర్ణిసేనను కించ‌ప‌రిచేలా ప‌ద్మావ‌త్ ను  చిత్రీక‌రించారంటూ ఆ వ‌ర్గం నేత‌లు ఆందోళన చేప‌ట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ పోలీసుల ప‌హారాలో సినిమా ఈ రోజు  విడుద‌ల చేయ‌డంతో  వివాదం ఉదృత‌మైంది.  అంతేకాదు సినిమాలో ప‌ద్మావ‌త్ గా యాక్ట్ చేసిన  దీపిక   కోసి తెచ్చిన వారికి ఐదు ల‌క్ష‌ల్ని బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. క‌ర్ణిసేన‌కు మ‌ద్ద‌త‌కు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఆరని పద్మావత్ మంటలు

Submitted by arun on Wed, 01/24/2018 - 12:45

పద్మావత్ సినిమా వివాదం మరింత రాజుకుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు కర్ణిసేన హింసాత్మక ఘటనకు పాల్పడింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ , హర్యానా, ఢిల్లీలో దాడులకు దిగింది. అహ్మదాబాద్ లో ధియేటర్ల దగ్గర బీభత్సం సృష్టించింది. ధియేటర్లపై దాడులు చేసిన కర్ణిసేన..వందకు పైగా వాహనాలను తగులబెట్టింది.  

ఆ సినిమాను బ్యాన్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా

Submitted by arun on Mon, 01/22/2018 - 14:55

పద్మావత్ సినిమా రిలీజ్ కు ముందే కర్ణిసేన దేశవ్యాప్తంగా రచ్చ సృష్టిస్తోంది. హర్యానాలోని కురుక్షేత్రలో సినీమాల్ పై కర్ణిసేన కార్యకర్తలు దాడి చేయగా... రాజస్తాన్ లో కర్ణిసేన నాయకుడు టీవీ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బిల్వరాలోని భారీ టీవీ టవర్ పై తెల్లవారుజామున 4 గంటలకు కర్ణిసేన నేత, పంచాయతీ అధ్యక్షుడు ఉపేంద్ర రాథోడ్ ఎక్కాడు.  తన వెంట పెట్రోల్ డబ్బాను పెట్టుకున్నాడు. పద్మావత్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకుంటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తున్నాడు. ఉపేంద్ర రాథోడ్ కు కర్ణిసేన కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు.