Pavan Kalyan

పవన్...ఆ ప్రతిజ్ఞ ఏమైంది? : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:34

వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రైతులను రెచ్చగొడుతున్నారని పవన్‌పై మండిపడిన రాజేంద్రప్రసాద్... ప్రత్యేక హోదా కోసం ఆమరణదీక్ష చేస్తానన్న ప్రతిజ్ఞ ఏమైందని ప్రశ్నించారు. కేసుల కోసం జగన్‌, మోడీ ఇచ్చే ప్యాకేజీ పవన్‌ బీజేపీకి లొంగిపోయారని బాబు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. చిరంజీవి కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా పార్టీని అమ్ముకుంటే పవన్ బీజేపీకి రిటైల్‌గా పార్టీని అమ్ముకున్నారని ఆరోపించారు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?

పవనే విడాకులు కావాలన్నారు : రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 11:46

రేణు దేశాయ్ కొన్ని నెలల క్రితం తన పెళ్లిని గురించి ప్రస్తావించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో కొందరు పవన్ అభిమానుల నుంచి ఆమె మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫైనల్‌ గా రేణూదేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ తో విడాకులకు సంబంధించిన విషయంపై స్పందించారు. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్...పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిన ప్రతిసారీ.. నేను వచ్చిసరిచేయాలా..?

Submitted by arun on Fri, 07/06/2018 - 11:16

సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక .. పవన్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరుతో ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది. దీనిపై రేణు స్పందించారు. ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నరని తెలిపింది. దీని గురించి కొందరు సభ్యత లేకుండా, మరికొందరు భయపెడుతూ కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. కొందరేమో ఆ మాటలు తప్పు అని చెప్పాలంటూ అడుగుతున్నారని తెలిపింది.

‘పెళ్లి విషయంలో అకీరా అప్‌సెట్’పై స్పందించిన రేణు

Submitted by arun on Tue, 06/26/2018 - 13:30

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెళ్లిపై కొన్నాళ్ల నుండి చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె పెళ్లి వార్త టాలీవుడ్‌లోనే కాక ప‌క్క రాష్ట్రాల‌లోను హాట్ టాపిక్‌గా మారింది. తోడు కోసం వెతుకుతున్నాన‌ని రేణూ ఎప్పుడో చెప్పిన‌, ఇటీవ‌ల త‌న పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భ‌ర్త‌కి రింగు తొడుగుతూ ఉన్న ఫోటోని షేర్ చేసి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది రేణూ. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కూడా రేణూకి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పెళ్లికి సంబంధించిన విశేషాలను రేణు ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

అపరిచితుడు కాదు... అజ్ఞాతవాసి కాదు.. పవన్‌ ఇప్పుడో పొలిటికల్‌ బుల్లెట్‌

Submitted by santosh on Sat, 05/26/2018 - 12:28

పవన్ కల్యాణ్ ఇప్పుడు అజ్ఞాతవాసి కాదు. పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలాన్ని ఒంటపట్టించుకున్న పవన్ తనదైన రీతిలో ప్రజల సంక్షేమానికి భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించడంతో మొదలైన పవన్ రాజకీయం అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రశ్నించడంతో మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం కావని పవన్ గ్రహించారు. ఉద్దానం విషయంలో జరిగింది 

శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించిన పవన్ కల్యాణ్

Submitted by arun on Sat, 04/14/2018 - 15:06

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన పోరాటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జమ్మూలోని ఆసిఫాపై జరిగిన అత్యాచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని.. అలాంటి వారికి తమలాంటి వారి మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.. కానీ టీవీ చర్చలకు వెళ్ళటం సరైంది కాదని సూచించారు. గతంలో షూటింగ్ సమయంలో చాలా సంఘటనలు జరిగాయని...

పవన్‌ను ‘నోరు తెరిస్తే అజ్ఞానం’ అంటూ కత్తి సంచలన ట్వీట్

Submitted by arun on Wed, 03/28/2018 - 17:07

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా పవన్‌ను నోరు తెరిస్తే అజ్ఞానమేనంటూ మహేష్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. ‘‘బాబు పవన్ కల్యాణ్! రాజ్యంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!’’ అంటూ మహేష్ సంచలన ట్వీట్ చేశారు.

ఉద్యమాలు నడిపే శక్తి పవన్ కళ్యాణ్‌కు లేదు : ముద్రగడ

Submitted by arun on Sat, 02/10/2018 - 15:44

ప్రత్యేక హోదా కోసం ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి వస్తే వారి వెనుక నడవడానికి సిద్దంగా ఉన్నామన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. తిరుపతిలో కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ కేంద్రం మెడలు వంచాలంటే చంద్రబాబు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు. అటు ఉద్యమాలు నడిపే శక్తి పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. మార్చి నెలాఖరులోగా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తమ తడాఖా చూపిస్తామన్నారు ముద్రగడ.


 

పవన్ కల్యాణ్‌కు నా మద్దతు: కత్తి మహేష్

Submitted by arun on Wed, 02/07/2018 - 14:54

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను’’ అని మహేష్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ పవన్‌పై కారాలు మిరియాలూ నూరిన మహేష్ ఇప్పుడిలా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ తన కార్యాచరణను వెల్లడిస్తారేమో వేచి చూడాలి.

అటూ ఇటూ కాకపోతే అనవసరపు అనుమానాలు వస్తాయి: కత్తి

Submitted by arun on Wed, 01/31/2018 - 13:15

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మరో సారి తనదైన శైలిలో స్పందించాడు. కొన్ని నెలలపాటు కత్తి మహేష్‌కు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య నడిచిన గొడవ చివరకు సద్దు మణిగింది. పవన్ అభిమానులు, మహేష్ పార్టీ చేసుకుని మరీ రాజీకి వచ్చారు. అప్పటి నుంచి మహేష్ రూటు మార్చారు. సాఫ్ట్‌గా తను అనుకున్నది చెప్పేస్తున్నారు. తాజాగా మహేష్ చేసిన ట్వీట్ పవన్‌ని ఉద్దేశించే అని అభిమానులు మండిపడుతున్నారు.