vijay devara konda

‘అర్జున్ రెడ్డి’ షూటింగ్‌లో నరకం అనుభవించా!

Submitted by arun on Tue, 05/29/2018 - 11:34

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల ఒకవిధంగా తనెంతో నరకయాతన అనుభవించానని ఈ మూవీ హీరోయిన్ షాలినీ పాండే తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పడిన నరకయాతన చెప్పలేను. గతంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలమయ్యా. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో ప్రేమ వైఫల్యంలో ఉన్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… లవ్‌లో ఫెయిల్ అయిన నేను హీరోతో రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం..అని శాలిని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.

సారీ మామ ఇప్ప‌టి నుంచి మాత్రం ప‌క్కా

Submitted by lakshman on Sun, 01/21/2018 - 20:01

డాక్ట‌ర్ అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ గా అలరించిన హీరో విజ‌య్ దేవ‌ర కొండ త‌న దైన స్టైల్లో పోలీసుల‌కు సారీ చెప్పాడు. అర్జున్ రెడ్డిసినిమాను అంద‌రూ చూసే ఉంటారు. ఆ సినిమాలో స్పోర్ట్స్ డ్రెస్ లో ఉన్న అర్జున్ రెడ్డి రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తుంటాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోక‌పోతే ఎలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతాయో చూడండి అంటూ అర్జున్ రెడ్డి సినిమాలోని బైక్ సీన్ ఫోటో నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతున్నాయి.