Kalyan Dileep Sunkara

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌వాల్ విసిరిన క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర

Submitted by lakshman on Wed, 03/28/2018 - 10:11

జ‌న‌సేన పార్టీ త‌రుపున పోరాటం చేసిన క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర ఆ పార్టీపై సంచ‌ల‌న‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీని స్థాపించిన నాటి నుండి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌న్ మ్యాన్ షో గా ముందుండి నడిపిస్తున్నారు. ఏ కార్య‌క్ర‌మ‌మైనా జ‌న‌సేన త‌రుపున ప‌వ‌న్ ఒక్క‌రే పాల్గొనేవారు. మిగిలిన వారిని ద‌గ్గ‌రికి కూడా రానిచ్చేవారు కాదు. గ‌తంలో అన్న‌య్య స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో ఉన్న‌వారంద‌రికి స‌ముచిత స్థానం క‌ల్పిస్తే చిరంజీవికి వెన్నుపోటు పొడిచార‌ని, కానీ తానుమాత్రం అలా చేయ‌న‌ని కాబ‌ట్టే బ‌హిరంగ‌స‌భ‌ల్లో నేను ఒక్క‌డినే మాట్లాడుతున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే. 

జ‌న‌సేన‌కు దిలీప్ సుంక‌ర గుడ్ బై..?

Submitted by lakshman on Tue, 03/27/2018 - 20:13

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌గా, ఆ పార్టీ అధినేత త‌రుపున సంద‌ర్భానుసారం వాదించే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర. అయితే ఆ క‌ల్యాణ్ దిలీప్ జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్తే కాకుండా ప‌వ‌న్ అభిమానం సంఘం నాయ‌కుడు కూడా. 

క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర‌కు షాకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్..?

Submitted by lakshman on Tue, 03/20/2018 - 03:29

బీజేపీతో పవన్ కళ్యాణ్ కి అవగాహన కుదిరిందా? జనసేనానిని కమలం పార్టీ నేతలే చంద్రబాబు మీదకు ఎగదోస్తున్నారా? పైకి కమ్యూనిస్టులతో స్నేహం చేస్తున్న పవన్ లోపల మరో మనిషి ఉన్నారా? సైద్ధాంతికంగా… రాజకీయంగా కూడా పైకి కనిపించే పవన్ కి లోపలి మరో మనిషికి వైరుధ్యం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి టీడీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా జనసేన చేపట్టిన పార్టీ నియామకాలను చూస్తే సాధారణ జనం కూడా టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే అంటున్నారు. బీజేపీకి పవన్ పార్టీకి మధ్య ఏదో జరుగుతుంది అని మాత్రం ప్రజలు భావిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ తరపున వాయిస్ వినిపించేందుకు కొందరిని ఎంపీక చేశారు.

ఐ ల‌వ్యూ నాగ‌బాబు డాడీ

Submitted by lakshman on Sun, 01/21/2018 - 18:04

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ ల వివాదం ముగిసిని విష‌యం తెలిసిందే. గ‌త కొద్దికాలంగా క‌త్తి మ‌హేష్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి క‌త్తి మ‌హేష్  ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూకి వెళుతుండ‌గా మాదాపూర్ ట‌వ‌ర్స్ నుండి శిల్పారామం మ‌ధ్య‌లో త‌న కారును అడ్డ‌గించి కోడిగుడ్ల‌తో దాడి చేశారు. ఈ దాడిపై క‌త్తిమ‌హేష్ మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
అంతేకాదు త‌న‌పై దాడికి పాల్ప‌డింది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్సేన‌ని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని కోరాడు.