AAP

పంద్రాగస్టు రోజే కేజ్రీవాల్‌కు ఊహించని షాక్!

Submitted by arun on Wed, 08/15/2018 - 12:37

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ జర్నలిస్ట్‌ అశుతోష్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత కారణాలతోనే’’ తాను పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ ట్విటర్ వేదికగా అశుతోష్ స్పందిస్తూ.. ‘‘ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుంది. ఆప్‌తో నా అందమైన, విప్లవాత్మక అనుబంధం కూడా ముగిసింది. నేను పార్టీకి రాజీనామా చేశాను. దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరాను. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.

కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్

Submitted by arun on Sun, 01/21/2018 - 15:57

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై.. రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పార్లమెంటరీ సెక్రటరీలుగా.. లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. 2 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీనికి.. కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెసిడెంట్  డెసిషన్‌.. కేజ్రీవాల్ సర్కార్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది. 

Tags