Jana Sena Party

పోలీస్‌స్టేషన్‌‌కి పవన్‌ కల్యాణ్‌..!

Submitted by arun on Tue, 04/24/2018 - 11:08

శ్రీరెడ్డి-వర్మ ఇష్యూలో తనకు న్యాయం కావాలంటూ... మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌‌కి డెడ్‌లైన్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌.... అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కాలని భావిస్తున్నారు. శ్రీరెడ్డి-వర్మ అండ్‌ కో వెనుక ...నారా లోకేష్‌ అండ్‌ టీమ్‌ ఉందని ఆరోపిస్తూ వస్తోన్న పవన్‌‌  మొత్తం ఎపిసోడ్‌పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా తనపై కుట్ర జరుగుతోందంటున్న పవన్‌‌ ఓవరాల్‌ ఇష్యూపై దర్యాప్తు చేపట్టాలని కోరనున్నారు.

నిజమైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా: పవన్‌

Submitted by arun on Sat, 04/21/2018 - 10:46

టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో  తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్‌లు చేశారు.  ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జనసేన పార్టీ మరో కొత్త సంప్రదాయం

Submitted by arun on Fri, 04/13/2018 - 12:00

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ‌్ పార్టీ పద్ధతుల్లో కూడా కొత్త మార్పులు ప్రవేశపెడుతున్నారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే రాజకీయ ఆచారానికి స్వస్థి చెప్పిన జనసేన కొత్త తరహాలో కార్యకర్తలకు, నేతలకు స్వాగతం పలుకుతోంది. అయితే కొత్తగా అనిపిస్తున్న ఈ పద్ధతి పార్టీ ప్రత్యేకతను చాటుతోందని జనసేనలోకి చేరుతున్నవారు అంటున్నారు. 

పవన్ కల్యాణ్‌కి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది!: ఎంపీ కవిత

Submitted by arun on Tue, 01/30/2018 - 17:24

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఎంపీ కవిత చెప్పారు. మీడియాతో సచివాలయంలో కాసేపు ముచ్చటించిన ఎంపీ కవిత అసెంబ్లీ నియోజక వర్గాల డి లిమిటేషన్ పై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. పసుపు మద్దతు ధరపై కేంద్రంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు కేబినెట్ లో స్థానం లేకపోవడం అంత పెద్ద విషయం కాదన్నారు. సిట్టింగ్  ఎమ్మెల్యేలను మార్చబోమని స్వయంగా సీఎం చెప్పారని, వచ్చే ఎన్నికల్లో హరీశ్  పార్లమెంటుకి వెళతారన్నది ప్రచారమేనన్నారు. 

పవన్‌ను నడిపిస్తున్న నాయకుడెవరు?

Submitted by arun on Mon, 01/22/2018 - 13:47

ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారుతానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? పాలిటిక్స్‌లో ఆరడుగుల బుల్లెట్‌ ఇక దూసుకుపోతాడా? అన్నయ్య పార్టీ ఐదారేళ్లలో దుకాణం ముసేయడానికి కారకులెవరో తెలుసంటూ ఎవరినీ వదిలిపెట్టనంటూ శపథం చేసిన కాటమరాయుడు ఇక కదం తొక్కబోతున్నారా? తెలంగాణ నుంచి ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టడం వెనుక పవన్‌‌కల్యాణ్‌ స్కెచ్‌కు అసలు లెక్కేంటి? మంచి చేస్తే చెడును వెతికే పవర్‌ పాలిటిక్స్‌లో పవన్ నిలిచి గెలుస్తారా? తట్టుకొని నిలబెడతారా? మొత్తంగా మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్‌ ఏ మలుపు తిరగబోతోంది? మున్ముందు పవన్‌కల్యాణ్‌ రాజకీయం ఎలా ఉండబోతోంది? 

సినిమా పోయింది... సీన్‌ తారుమారైంది

Submitted by arun on Sat, 01/20/2018 - 17:03

పవన్‌కళ్యాణ్. ప్రశ్నించే గొంతుక.. ఎవరినైనా నిగ్గదీసి అడిగే ధైర్యం. ఆయన గురించి అభిమానుల అభిప్రాయమిది. జనసేన పెట్టినప్పుడు, పార్టీ పుట్టినప్పుడు పవన్ ఆవేశం చూసి అభిమానులు, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ గురించి ఆలోచించే నాయకుడు.. ప్రశ్నించే నేత వచ్చాడని ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ ప్రశ్నించాల్సిన గొంతుక ఎందుకు మూగబోతోంది? సక్సెస్‌ అంచనాలను అందుకోలేక చతికిలపడ్డ అజ్ఞాతవాసితో పవన్‌కల్యాణ్‌లో పొలిటికల్‌ ఫైర్‌ తగ్గించిందా? పట్టున్న జిల్లాల్లో సభలు పెడుతూ చప్పట్లు కొట్టించుకుంటే... సమస్యలపై అప్పుడప్పుడూ పోరాడుతుంటే రాజకీయంగా రాణిస్తారా? అసలు అభిమానుల లెక్కలేంటి?