madhya pradesh

పిక్నిక్‌కు వెళ్లిన 12 మంది గల్లంతు... మరో 30 మంది....

Submitted by arun on Thu, 08/16/2018 - 11:16

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో పిక్నిక్ కోసం వచ్చిన 12 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. ఊహించని విధంగా ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. శివపురి, గ్వాలియర్ సరిహద్దుల్లోని సుల్తాన్‌ఘడ్ పోల్ దగ్గర పిక్నిక్ చేసుకుందామని వచ్చిన 12 మందిపైకి వరదనీరు ముంచెత్తడంతో వారంతా వంద అడుగుల దిగువకు పడిపోయారు. వరదనీరు వారిని కిందకు నెట్టేసింది. మరో 30 మంది నది మధ్యలో రాతిపైభాగాన చిక్కుకుపోయారు.

ప్రేమ పెళ్లి చేసుకున్నారని మూత్రం తాగించారు..

Submitted by arun on Wed, 08/01/2018 - 16:48

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ  జంటకు ఘోర అవమానం ఎదురైంది. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరం. మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లా హర్దాస్‌పూర్‌‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతులు.. ఇటీవలే అలీరాజ్‌పూర్‌లోని తన మామ నివాసానికి(యువకుడి మేనమామ) చేరుకున్నారు.

మట్టిలో మాణిక్యం...‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:30

విద్యకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఓ నిరుపేద విద్యార్ధి.. ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంక్ తో పాటు నీట్ లో 803వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ విద్యార్ధి చెత్త ఏరుకునే వ్యక్తి కొడుకు...పేరు ఆశారాం చౌదరి..సొంతూరు మధ్యప్రదేశ్ లోని దేవాన్ గ్రామం. ఎంతో దర్భరమైన పరిస్థితులతో ఆశారం కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. అయినా ఏనాడు కుంగిపోలేదు పట్టుదలతో విద్యలో ముందడుగు వేశాడు. తొలి ప్రయత్నంలోనే అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకుతో పాటు నీట్ లో 803 ర్యాంకును సాధించాడు.

మధ్యప్రదేశ్‌లో దారుణం...తల్లి మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తరలించిన కొడుకు

Submitted by arun on Thu, 07/12/2018 - 10:15

ఒక యువకుడు తన తల్లి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బైక్ మీద 35 కిలో మీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. టికమ్ గఢ్ జిల్లాలోని మస్తాపుర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తల్లి శవాన్ని బైక్ పై తీపుకెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారడంతో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. 
 

దారుణం...పెట్రోల్ బంక్‌కు కార్మికుడిని కట్టేసి కొరడాతో కొట్టిన యజమాని

Submitted by arun on Fri, 07/06/2018 - 12:36

మధ్యప్రదేశ్‌లోని హోషంగ్‌బాద్‌లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్‌లో ఓ కార్మికుడిని చితక్కొట్టాడు బంక్ యాజమాని. గత ఆరు రోజుల నుంచి అనారోగ్యంతో కార్మికుడు డ్యూటీకి రావడంలేదని ఆగ్రహించిన యాజమాని..కార్మికుడిని పిలిపించాడు. పెట్రోల్ బంక్ కు కార్మికుడిని తాళ్లతో కట్టేసి కొరడాతో చితకబాదాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 34 సార్లు కొరడా ఝులిపించాడు. అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా, వైరల్‌ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు.

ఏకంగా జడ్జీ సీటులో కూర్చొని.. అడ్డంగా బుక్కయ్యాడు!

Submitted by arun on Mon, 07/02/2018 - 17:27

శిక్షణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సెల్ఫీ మోజులో.. జడ్జి చైర్‌లో కుర్చుని సెల్ఫీలు దిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రామ్‌ అవతార్‌ రావత్‌ అనే వ్యక్తి ఉమారియా పోలీస్‌ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్‌.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు. రావత్‌ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కొత్వాలి పోలీసులు రావత్‌పై కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

చావడానికి దూకితే...

Submitted by arun on Mon, 06/25/2018 - 12:52

రెండు నెలల తన బిడ్డతో సహా రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళ చిన్న గాయమైనా కాకుండా ప్రాణాలతో బయటపడింది. ఆమెపై నుంచి రైలు వెళ్లినా బతికి బట్టకట్టడం విశేషం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ రైల్వే స్టేషన్‌లో శనివారం నాడు చోటుచేసుకుంది.  ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

ఐపీఎస్ ఆఫీసర్ వెంట పడుతున్న ఓ యువతి

Submitted by arun on Wed, 06/20/2018 - 10:29

కేవలం సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్ల వెంటే అభిమానులు పడుతుంటారని భావిస్తుంటారా? అయితే, మీ ఆలోచన తప్పు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మూడు రోజుల క్రితం వచ్చిన పంజాబ్, హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి, తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంది. ఈ యువతి సైకాలజీలో పీజీ చేసింది. ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34)ను కలవాలని ఆ యువతి.. ఆయన కార్యాలయం ముందు పడిగాపులు కాస్తుంది.

మహంకాళి ఆలయం ముందు మహిళలపై వీరంగం

Submitted by arun on Mon, 06/18/2018 - 13:38

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను కూడా తీవ్రంగా చితకబాదాడు. ఇరు వర్గాల మహిళలు కూడా కొట్టుకున్నారు. ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్‌లు చూశాడు.

10 రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్

Submitted by arun on Wed, 06/06/2018 - 18:50

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైతుల మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంగా జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.