harassment

అతనికన్నా.. ఆమె జీతం రెట్టింపు.. అదే శాపంగా మారింది

Submitted by arun on Fri, 06/15/2018 - 12:53

తనకన్నా తన భార్య ఎక్కువ సంపాదన ఆర్జించడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో.. ఏదో ఒక కారణంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను కూడా భర్త తనకు కాకుండా చేశాడు. దీంతో.. తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...విశాఖ 3వ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ చినవాల్తేరు కిర్లంపూడి ప్రిన్స్‌ అపార్టుమెంట్‌లో పీతల అప్పారావు నివాసముంటున్నారు.

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్యపై భర్త ఘాతుకం

Submitted by arun on Sat, 01/20/2018 - 13:31

హైదరాబాద్‌‌లో శాడిస్ట్‌ మొగుడు భార్యకు నరకం చూపించాడు. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టిన నగేష్‌ దారుణానికి ఒడిగడ్డాడు. భార్యకు పిచ్చి పట్టిందంటూ మంత్రగాడితో భార్యకు వాతలు పెట్టించాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో ఈ దారుణం జరిగింది. శామీర్‌పేట పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండలానికి చెందిన మంగకు 10 ఏండ్ల క్రితం మండలంలోని బొమ్మరాశిపేటకు చెందిన కంచుగంట్ల నగేష్‌తో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని ఏండ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో నగేష్‌కు వివాహేతర సంబం ధం ఏర్పడింది.