Anasuya

వైఎస్సార్ బయోపిక్‌లో అనసూయ.. ఏ పాత్రలోనంటే..

Submitted by arun on Sat, 06/30/2018 - 10:36

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు రాజకీయ నాయకురాలి పాత్రను అనసూయ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్య సన్నివేశాన్నీ మహి మిస్ చేయడం లేదట. చిన్న రోల్ కోసం అనసూయ లాంటి పాపులర్ ఫిగర్‌ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గ్రాండ్‌గా కనిపించాలని..

చికాగో సెక్స్ రాకెట్ .. అనసూయ అప్పుడే ఛీకొట్టిందట

Submitted by arun on Mon, 06/18/2018 - 13:11

చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు నిగ్గుతేల్చడంతో ఇప్పుడు కిషన్ మోదుగుమూడి పాల్పడ్డ పాత అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మన సినీతారలు, యాంకర్లతో కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళ చేసిన నీచాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని..

అన‌సూయ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్‌ ?

Submitted by arun on Tue, 04/24/2018 - 17:22

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం వెండితెర మీద కూడా త‌న స‌త్తా చాటుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన `రంగ‌స్థ‌లం` సినిమా ఆమెకు ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో రంగ‌మ్మత్త‌గా అన‌సూయ అద్భుతంగా న‌టించింది. తాజాగా అన‌సూయ‌కు మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అనసూయ న్యూ లుక్ : రంగస్థలం అత్త ఇలా ఉంది

Submitted by arun on Mon, 03/19/2018 - 16:16

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వస్తున్న సినిమా 'రంగస్థలం'. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తోంది. అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రంగమ్మత్తగా అలరించనున్న అనసూయ స్టిల్ ఒకటి తాజాగా బయటకు వదిలింది చిత్రయూనిట్.

బాలుడి ఫోన్ పగలగొట్టిన ఉదంతంపై స్పందించిన అనసూయ

Submitted by arun on Tue, 02/06/2018 - 18:02

జబర్దస్త్ యాంకర్ అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనసూయ తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్‌ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యాంకర్‌ అనసూయ ఏదో పని నిమిత్తం తార్నాక విజయపురికాలనీకి వచ్చింది. తన తల్లితో కలిసి అటుగా వెళ్తోన్న బాలుడు రోడ్డుపక్కన అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.

ముచ్చటపడిన బాలుడు.. ఫోన్ పగులగొట్టిన అనసూయ

Submitted by arun on Tue, 02/06/2018 - 14:17

స్టార్‌ యాంకర్‌, టాలీవుడ్‌ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్‌ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

క్లారిటీ ఇచ్చిన అనసూయ

Submitted by arun on Sat, 01/20/2018 - 12:22

తన అందంతో యువతను బుల్లి తెరకు కట్టిపడేసే అనసూయ..టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో బోలెడన్ని విషయాలు పంచుకుంటోంది. మధ్య మధ్యలో చాట్ చేస్తూ నాటీ ఆన్సర్లతో స్వీట్ రిప్లైలు ఇస్తుంది. ఈ రోజు కూడా అనసూయ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో చాటింగులో పాల్గొంది ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టకటకా సమాధానాలు ఇచ్చేసింది. త్వరలో ఆమె ‘రంగస్థలం’ సినిమాతో మరోసారి వెండి తెరపై వెలగనున్న సంగతి తెలిసిందే.