renu desai

అవి అందమైన జ్ఞాపకాలు: రేణు దేశాయ్

Submitted by arun on Mon, 09/17/2018 - 17:32

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా పాత స్మృతులను నెమరేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో, తనతో ముడివేసుకున్న బెలె అనే పెంపుడు కుక్క గురించి పోస్ట్ పెట్టారు. ఆ కుక్క పేరు బెల్‌. న్యూ ఫౌండ్‌ల్యాండ్‌ జాతికి చెందిన శునకం. అది పవన్‌ పెంపుడు కుక్కే. ఈ శునకంతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్‌ కూడా ఉంది. షూటింగ్‌ సమయంలో అందరూ బెల్ ఆకారాన్ని చూసి తెగ భయపడేవారు.

కాబోయో భర్తతో రేణు దేశాయ్.. అకీరా తీసిన ఫోటో..

Submitted by arun on Sat, 07/14/2018 - 16:31

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడాకులు పొంది ఏడేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ళపాటు ఆమె పుణేలో తన పిల్లలతో గడిపింది. ఇటీవలే తాను రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ నిర్ణయించుకోవడం, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపోయాయి. త్వరలో వివాహం జరగబోతోంది. కానీ ఇంత వరకు వరుడు ఎవరనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది. సోషల్ మీడియలో ఫొటోలు పెడుతున్నా... కాబోయే భర్త ముఖం మాత్రం స్పష్టంగా కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

పవనే విడాకులు కావాలన్నారు : రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 11:46

రేణు దేశాయ్ కొన్ని నెలల క్రితం తన పెళ్లిని గురించి ప్రస్తావించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో కొందరు పవన్ అభిమానుల నుంచి ఆమె మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫైనల్‌ గా రేణూదేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ తో విడాకులకు సంబంధించిన విషయంపై స్పందించారు. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

పవన్‌కో రూల్‌ నాకో రూలా?: రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 09:45

ఎవరు ఏది మాట్లాడమంటే..అది మాట్లాడటానికి తాను కీలుబొమ్మను కాదంటోంది రేణు దేశాయ్. పవన్ పై విమర్శలొస్తే తానెందుకు స్పందించాలంటూ..మరోసారి ఫ్యాన్స్ దుమ్ము దులిపింది రేణూ. తనను ప్రశాంతంగా బ్రతకనివ్వరా అంటూ..అభిమానులను ఎడాపెడా వాయించేసింది.
 
పవన్ కల్యాణ్ కో రూల్ నాకో రూలా అంటూ రేణు దేశాయ్ మరోసారి అభిమానులపై ఫైర్ అయ్యింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పవన్‌ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కి రేణూ దేశాయ్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా పవన్ అభిమానులు దానిపై స్పందించమని సోషల్ మీడియాలో రేణూని వేధిస్తున్నారట.

పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్...పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిన ప్రతిసారీ.. నేను వచ్చిసరిచేయాలా..?

Submitted by arun on Fri, 07/06/2018 - 11:16

సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక .. పవన్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరుతో ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది. దీనిపై రేణు స్పందించారు. ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నరని తెలిపింది. దీని గురించి కొందరు సభ్యత లేకుండా, మరికొందరు భయపెడుతూ కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. కొందరేమో ఆ మాటలు తప్పు అని చెప్పాలంటూ అడుగుతున్నారని తెలిపింది.

పవన్ అభిమానులకు రేణు దేశాయ్ వార్నింగ్‌....నేను నోరు తెరిస్తే మీ పొగరు గంగపాలే

Submitted by arun on Fri, 06/29/2018 - 10:48

పవన్ కల్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని, మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. విడాకుల వ్యవహారంపై తాను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులకు గర్వభంగం అవుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

పవన్ ఫ్యాన్స్ దాడి.. ట్విటర్‌కు రేణు గుడ్‌బై

Submitted by arun on Tue, 06/26/2018 - 15:59

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఆమెపై పవన్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో రేణు తన ట్విటర్ అకౌంట్‌ను డీఆక్టివేట్ చేసుకుంది. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చింది. "ట్విట్టర్‌లో విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఉండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వాళ్లు. సినిమా వాళ్ల గురించి కానీ, రాజ‌కీయ నాయ‌కుల గురించి కాని త‌ప్పుగా రాయడానికే ఇష్టప‌డ‌తారు. నేను ఓ నూత‌న జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ స‌మ‌యంలో ఒక నిర్ణయానికి వ‌చ్చాను.

‘పెళ్లి విషయంలో అకీరా అప్‌సెట్’పై స్పందించిన రేణు

Submitted by arun on Tue, 06/26/2018 - 13:30

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పెళ్లిపై కొన్నాళ్ల నుండి చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె పెళ్లి వార్త టాలీవుడ్‌లోనే కాక ప‌క్క రాష్ట్రాల‌లోను హాట్ టాపిక్‌గా మారింది. తోడు కోసం వెతుకుతున్నాన‌ని రేణూ ఎప్పుడో చెప్పిన‌, ఇటీవ‌ల త‌న పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భ‌ర్త‌కి రింగు తొడుగుతూ ఉన్న ఫోటోని షేర్ చేసి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది రేణూ. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కూడా రేణూకి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పెళ్లికి సంబంధించిన విశేషాలను రేణు ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

ఇది ప్రేమ వివాహం కాదు: రేణూ దేశాయ్‌

Submitted by arun on Tue, 06/26/2018 - 11:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్...గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. మ‌రికొద్ది రోజుల్లో మ‌రో వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇటీవ‌లె రేణు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. తాజాగా త‌న రెండో వివాహం గురించి ఓ ఆంగ్ల ప‌త్రికతో రేణు మాట్లాడారు.
 

రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందించిన పవన్

Submitted by arun on Tue, 06/26/2018 - 10:00

తన రెండో భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం సందర్భంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్పందించారు. రెండు రోజుల క్రితం ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో ఎంగేజ్‌ మెంట్ చేసుకున్న రేణూదేశాయ్ వైవాహిక జీవితం బాగుండాలని.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్ చేశారు. దేవుడి సహాకారంతో భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.