Telugu Desam Party

తెలుగు ఎంపీల ఆందోళన...ఉభయసభలు వాయిదా

Submitted by arun on Tue, 03/06/2018 - 11:21

రెండో రోజు మొదలైన పార్లమెంటు ఉభయసభలు తెలుగు ఎంపీల ఆందోళనతో కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని ఏపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు రిజర్వేషన్ల కోటా పెంపు అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. అటు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగు ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను అరగంటపాటు వాయిదా వేశారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు

Submitted by arun on Fri, 03/02/2018 - 18:05

అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభజన హామీల సాధన డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించారు. విభజన హామీల విషయంలో కేంద్రం దిగి వచ్చే  వరకు పోరాటం ఆపకూడదని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమని ఎంపీలు ప్రకటించారు. ఇందుకోసం ఇతర పార్టీల మద్దతు తీసుకుంటామని చెప్పారు.  అవసరమైతే కోర్టుకు సైతం వెళతామన్నారు.

టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న‌లు..?

Submitted by lakshman on Mon, 01/29/2018 - 22:11

సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ పార్టీ నేత‌లు గ‌ణాంకాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ గ‌ణాంకాల ఆధారంగా  టీడీపీ ఎలా వెన్నుపోటు పొడిచిందో కేడ‌ర్ కు చెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. ఇందులో భాగంగా ఆ పార్టీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు అమరావతి, రాజమండ్రి, విజయనగరాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌నలో టీడీపీ మిత్ర ధ‌ర్మం, పార్టీపై  కేడ‌ర్ కు ఉన్న అపోహ‌లు, టీడీపీ - బీజేపీ మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా వున్నది ? పీఎం మోడీ వచ్చాక ఎలా ఉంది ? టీడీపీ  నాడు ఎలాంటి వెన్నుపోట్లు  పొడించింది..?

టీడీపీ పని గోవింద

Submitted by arun on Fri, 01/19/2018 - 12:48

తెలంగాణ‌లో టీడీపీ ప‌ని అయిపోయిన‌ట్లేనా? పార్టీ మ‌నుగ‌డ అసాధ్యమ‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారా? అధినేత చంద్రబాబు పార్టీని ప‌ట్టించుకోనందునే‌.. అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? మోత్కుపల్లి వ్యాఖ్య‌లతో టీడీపీ భవిష్యత్తు మీద కమ్ముకున్న నీలినీడలు మరోసారి బహిర్గతమయ్యాయి.