vikram

‘సామి' సంగతి

Submitted by arun on Thu, 09/27/2018 - 17:31

‘సామి' మూవీ లో విక్రమ్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే  బాబీ సింహా విలనిజం కూడా తోడైది, అయితే  రోటీన్ రివేంజ్ డ్రామా, వయొలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటం, కథలో కొత్తదనం లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో నిలబడక పోవచ్చు. ముక్యంగా ‘సామి' మూవీ మనం చాల సార్లు చుసిన రోటీన్ రివేంజ్ పోలీస్ డ్రామా. కథలో కొత్తదనం లేక పోయినా యాక్షన్, కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ‘సింగం' సిరీస్ తరహాలో మరో పోలీస్ డ్రామా చూడాలనుకుంటే వెళ్లొచ్చు. దర్శకుడు ఇంతకు ముందు సింగం, సింగం 2, సింగం 3 సినిమాలను తీసిన హరి.  ‘స్వామి' సినిమాలో కాస్త కాన్సెప్టును, హీరో హీరోయిన్లను, ఇతర నటీనటులను మార్చినట్లు ఉందే తప్ప కొత్తదనం చూపించలేదు.

Tags

ఒకటి కాదు, రెండు కాదు పది లక్షల కోట్ల లూటీ

Submitted by arun on Sat, 02/24/2018 - 12:01

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో పెద్ద మొత్తంలో అకౌంట్లలో వేశారు. ఇప్పుడు ఆ అకౌంట్లే లక్ష్యంగా బడాబడా పారిశ్రామిక దొంగలు దోచుకెళ్తున్నారు. నిన్న విజయ్ మాల్యా, నేడు నీరవ్‌ మోడీ, రేపు ఇంకెందరో...ఇలా లెక్కేసుకుపోతే, పారిశ్రామికవేత్తలు బ్యాంకులను దోచేసింది ఎంతో తెలుసా...

విక్ర‌మ్‌తో రిపీట్ చేస్తుందా?

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:31

త‌మ‌న్నాకి తెలుగులో కంటే త‌మిళంలో మంచి విజ‌యాలున్నాయి. సూర్య‌తో చేసిన 'అయ‌న్' (తెలుగులో 'వీడొక్క‌డే').. కార్తీతో చేసిన 'ప‌య్యా'(ఆవారా), 'సిరుత్తై'('విక్ర‌మార్కుడు' రీమేక్‌), 'తోళా' (ఊపిరి).. అజిత్‌తో చేసిన 'వీర‌మ్' (వీరుడొక్క‌డే).. ధ‌నుష్‌తో చేసిన 'ప‌డిక్కాద‌వ‌న్‌'.. విజ‌య్‌సేతుప‌తితో చేసిన 'ధ‌ర్మ‌దురై' చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో పాటు త‌మ‌న్నాకి త‌మిళ‌నాట మంచి పేరుని తీసుకువ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న త‌మిళ చిత్రం 'స్కెచ్‌'. ఇందులో విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. విక్ర‌మ్‌తో త‌మ‌న్నా జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి.

'స్కెచ్' టీజ‌ర్‌.. దీపావ‌ళికి

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 19:19

విక్ర‌మ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'స్కెచ్‌'. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ త‌మిళ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కుతున్న 'స్కెచ్‌'లో.. త‌మ‌న్నా డీ గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

రెండు సీక్వెల్స్‌లో కీర్తి సురేష్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 13:31

టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా రెండు చోట్లా బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో కీర్తి సురేష్‌ ఒక‌రు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆమె న‌టించిన మూడో తెలుగు చిత్రం సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఆ చిత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం.

ఇస్తాంబుల్‌లో విక్ర‌మ్‌

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 13:54

'శివ‌పుత్రుడు', 'అప‌రిచితుడు' చిత్రాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు విక్ర‌మ్‌. ఆ త‌రువాత మాత్రం వ‌రుస ప‌రాజ‌యాలే వ‌రించాయి ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌ని. గ‌తేడాది ఇదే సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన 'ఇంకొక్క‌డు' మాత్ర‌మే కాస్త ఫ‌ర‌వాలేద‌నిపించుకుంది.

ఇదిలా ఉంటే.. విక్ర‌మ్ ప్ర‌స్తుతం మూడు త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'స్కెచ్' (త‌మ‌న్నా హీరోయిన్‌), 'ధృవ‌న‌క్ష‌త్రం' ('పెళ్లిచూపులు' ఫేం రీతూ వ‌ర్మ క‌థానాయిక‌), 'సామి 2' ('లక్ష్మీ న‌ర‌సింహా' ఒరిజ‌న‌ల్‌కి సీక్వెల్‌.. కీర్తి సురేష్‌, త్రిష హీరోయిన్స్‌).

సీనియ‌ర్ హీరోయిన్స్ తో విక్ర‌మ్‌

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:39

'అప‌రిచితుడు' చిత్రం రిలీజై ప‌న్నెండేళ్లు అయినా చియాన్ విక్ర‌మ్ కి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌నే లేదు. గ‌త చిత్రం 'ఇరుముగన్' (తెలుగులో 'ఇంకొక్క‌డు')తో ఆ లోటు తీరుతుంద‌ని  అంతా అనుకున్నారు. కానీ ఆశించిన ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ మేన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'ధ్రువ న‌క్ష‌త్రం'తో క‌చ్చితంగా విక్ర‌మ్ కోరుకుంటున్న విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు.