Sussanne Khan

విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?

Submitted by arun on Mon, 07/30/2018 - 16:15

బాలీవుడ్ కపుల్ హృతిక్‌రోషన్, సుసానె ఖాన్ చాన్నాళ్ల కిందటే తమ వైవాహిక బంధానికి తెర దించారు. విడాకులతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని రెండు రోజులుగా బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నా.. చాలా రోజులుగా పిల్లల కోసం మళ్లీ కలిసి తిరుగుతూనే ఉన్నారు. హాలిడే టూర్లకు కూడా వెళ్తున్నారు. పెళ్లి అనే బంధం ఒక్కటి లేకపోయినా.. అంతకుముందు కలిసి ఉన్నట్లే ఇప్పుడూ ఈ జంట కలిసే ఉంటున్నది. ఇద్దరం కలిసే తమ పిల్లలు హృహాన్, హృదాన్‌ల బాగోగులు చూసుకుంటామని గతంలోనే హృతిక్, సుసానె చెప్పారు.

మాజీ భార్యను పెళ్లాడనున్న హీరో!

Submitted by arun on Thu, 01/18/2018 - 17:01

భార్యతో విడిపోయిన ఓ స్టార్ హీరో మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అయితే వేరొక మహిళను పెళ్లాడటం లేదులెండి. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌.. భార్య సూసాన్నే ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు మగపిల్లలు. వారి కోసమే ఇద్దరూ అప్పుడప్పుడూ పార్టీలు, విహారయాత్రల్లో కలుస్తుంటారు. అయితే..వీరిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి మనస్పర్థలు లేవని ఇద్దరూ కలిసిపోవాలనుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకోసం హృతిక్‌..సుసాన్నేను మరోసారి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడట. అదీకాకుండా ఇటీవల హృతిక్‌ తన పుట్టినరోజు జరుపుకున్నాడు.